సామాన్యుడులా కేసీఆర్..ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కారును నిలుపుతూ ప్రయాణం

132

తెలంగాణలో ఎన్నికల సమరం ముగిసింది. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ మ్యాజిక్ ఫిగర్‌కు కావాల్సిన 60 స్థానాలను ఈజీగా క్రాస్ చేసింది.

ఆదివారం వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలను గెలుచుకోగా, అధికార బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చారు ఓటర్లు.

బీఆర్ఎస్ పార్టీ కేవలం 39 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. ఇక ఎప్పటిలాగే ఎంఐఎం 7 స్థానాల్లో తిరిగి తమ పట్టునిలుపుకోగా ,బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించింది. సీపీఐ కొత్తగూడెం స్థానంలో విజయకేతనం ఎగరేసింది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ ఓడిపోవడంతో సీఎం కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రత్యేక అధికారితో తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు అందజేశారు.

Also Read: సెల్యూట్ చేస్తే లాఠీ తో గన్ మెన్ పై విరుచుకుపడ్డ పోలీస్ అధికారి

అనంతరం ఆయన ప్రగతి భవన్‌ను ఖాళీ చేశారాయన. ప్రగతి భవన్‌ నుంచి బయటకు వచ్చే సమయంలో కేసీఆర్ భావోద్వేగంతో కనిపించారు. సీఎం కాన్వాయ్‌ను ప్రగతి భవన్‌లోనే వదిలిపెట్టిన కేసీఆర్ ..మేనల్లుడు రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కారులో అక్కడ నుంచి ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌కు వెళ్లిపోయారు.

ఈ సమయంలో కేసీఆర్ సామాన్యుడులా ప్రయాణించారు. రోడ్డు మీద ట్రాఫిక్ సిగ్నల్స్ పడ్డ చోటల్లా . కారును నిలుపుతూ ఓ సామాన్య ప్రయాణికుడులా కేసీఆర్ ప్రయాణించారు. బీఆర్ఎస్ ఓటమి తరువాత ఆ పార్టీని ఎవరు ముందుండి నడిపిస్తారనే టాక్ ఆ పార్టీలో చర్చ సాగుతుంది. గతంలో మాదిరిగా కేసీఆర్ పార్టీలో క్రియాశీలకంగా ఉండే అవకాశం కనిపించడం లేదు.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top