Actor Mahalakshmi: మా ఆయన బరువు తగ్గట్లేదు.. జుట్టు కూడా ఊడిపోతోంది.. అందుకే.. ఈ నిర్ణయం

141

తమిళ బుల్లితెర నటి మహాలక్ష్మి, ప్రముఖ నిర్మాత, లిబ్రా ప్రొడక్షన్స్‌ అధినేత రవీంద్ర చంద్రశేఖరన్‌ ఏడడుగులు నడిచి సుమారు ఏడాదిన్నర కావోస్తోంది. అయితే పెళ్లైనప్పటి నుంచి ఈ దంపతులు ఏదో ఒక విషయంతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.

ఇద్దరికీ రెండో పెళ్లి కావడం, మొదటి వివాహం నుంచి బిడ్డ ఉండడంతో మహాలక్ష్మి, చంద్రశేఖరన్‌ల వివాహం గతేడాది తీవ్ర చర్చనీయాంశమైంది. మహాలక్ష్మీ డబ్బు కోసమే రవీందర్‌ను పెళ్లి చేసుకుందని, అలాగే మహాలక్ష్మి లాంటి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు నిర్మాత రవీందర్ ఎన్నో ట్రిక్కులు వేశాడని సోషల్‌ మీడియాలో భారీగా ట్రోల్స్‌ వచ్చాయి. అయితే ఇవేవీ పట్టించుకోకుండా ఎంతో అన్యోన్యంగా కాపురం చేస్తున్నారీ లవ్లీ కపూల్‌. ఆ మధ్యన రవీందర్‌ ఛీటింగ్‌ కేసులో జైలుకు వెళ్లడం, నటి మహాలక్ష్మి కూడా అతనితో విడాకులు తీసుకుంటుందని వినిపించాయి. అయితే అవన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి. ఇలా పెళ్లైనప్పటి నుంచి నిత్యం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోన్న ఈ జంట వాటిని అధిగమించి ఆనందంగా జీవిస్తున్నారు. ఇదిలా ఉంటే మహాలక్ష్మితో పెళ్లి సమయంలో రవీందర్‌ శరీరాకృతిపై కూడా భారీగా ట్రోల్స్‌ వచ్చాయి. తాజాగా ఈ విషయంపై నటి స్పందించింది.

'మా వివాహమయ్యాక చాలా మంది ట్రోల్స్‌ చేశారు. మేం వాటినీ పట్టించుకోలేదు. ముఖ్యంగా నా భర్త రవీందర్ బరువు ఎక్కువగా ఉండడంతో కొందరి నెటిజన్లకు ఆయన టార్గెట్‌గా మారారు. ట్రోల్స్‌ను చూసి నేను చాలా బాధపడ్డాను. ట్రోల్స్‌ను చూసి బరువు తగ్గాలని రవీందర్‌ ఎంతగానో ప్రయత్నం చేశాడు. అయినా అది కుదరడం లేదు. అందుకే మా ఆయన మాదిరిగా నేను కూడా బరువు పెరగాలనుకుంటున్నాను. ఇందుకోసం అధికంగా కొవ్వు పదార్థాలు కూడా తీసుకుంటున్నాను. మిడ్‌నైట్స్‌లో ఎక్కువగా ఆహారం తింటున్నాను. వీటి వల్ల ఆ సమయంలో నాకు నిద్ర కూడా దూరమై పోతుంది. ఏదేమైనా నేను కూడా ఆయనలా మారాలని నిర్ణయించుకున్నా. అప్పుడైనా ఈ ట్రోల్స్‌ ఆగిపోతాయి అనుకుంటా' అని చెప్పుకొచ్చింది మహాలక్ష్మి. అలాగే తన భర్త రవీందర్‌ జుట్టు కూడా ఊడిపోతోందని, ఇది తనకు చాలా బాధ కలిగిస్తోందిని నటి తెలిపింది. సరదాగా చెప్పిందో, సీరియస్‌గా తీసుకుందో తెలియదు కానీ మహాలక్ష్మీ కామెంట్స్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇలాంటి నిర్ణయాలు ఆరోగ్యానికి ప్రతిబంధకంగా మారుతాయని అభిమానులు, నెటిజన్లు సూచిస్తున్నారు.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top