Aadhaar: ఆధార్ కార్డులోని వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవడానికి మరో 3 నెలల గడువు

95

కేంద్ర విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ కార్డులోని వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవడానికి మరో 3 నెలల గడువు పొడిగించింది. 2023 డిసెంబర్ 14తో ముగియనున్న గడువును 2024 మార్చి 14 వరకు పొడిగించింది.

ఆధార్ కార్డులో పేరు, అడ్రస్, జన్మదినం, లింగం, ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ వంటి వివరాలను ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. బయోమెట్రిక్ వివరాలు మార్చుకోవాలంటే ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది.

మైఆధార్ పోర్టల్ ద్వారా ఆధార్ అప్‌డేట్ చేయడానికి:

  • https://myaadhaar.uidai.gov.in/https://myaadhaar.uidai.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.
  • మీ ఆధార్ నంబర్ లేదా ఎన్‌రోల్‌మెంట్ ఐడీతో లాగిన్ అవ్వండి.
  • పేరు, జెంజర్, జన్మదినం అడ్రస్ అప్‌డేట్ బటన్ పై క్లిక్ చేయండి.
  • అప్‌డేట్ ఆధార్ ఆన్‌లైన్ పై క్లిక్ చేయండి.
  • మీరు అప్‌డేట్ చేయాలనుకుంటున్న అంశాన్ని ఎంచుకుని ప్రొసీడ్ అప్‌డేట్ ఆధార్ పై క్లిక్ చేయండి.
  • వివరాలు నమోదు చేసి దానికి సంబంధించిన స్కాన్ చేసిన కాపీలు అప్‌లోడ్ చేయండి.
  • వివరాలు అన్ని ఇచ్చిన సబ్‌మిట్ చేసిన తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ ఉంటుంది. దానిని స్టేటస్ తెలుసుకోవడానికి భద్రంగా దాచుకోండి.
Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top