pallavi prashanth Arreste: బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్

240

సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో పోలీసులు బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే అనంతరం అన్నపూర్ణ స్టూడియో దగ్గర జరిగిన గొడవలు, ఆతర్వాత పరిణామాలకు సంబంధించి పల్లవి ప్రశాంత్ పై మొత్తం 9 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో రైతు బిడ్డను A1 గా చేర్చారు పోలీసులు. అలాగే అతని తమ్ముడిని A2 గా చేర్చారు. వీరితో పాటు అతని స్నేహితులు, అభిమానులపై కూడా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.

Also Read : బిగ్‌బాస్‌ విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ ఫ్యాన్స్‌ రియాక్షన్‌పై స్పందన

ఆదివారం (డిసెంబర్ 17) బిగ్ బాస్ ఫైనల్స్ తర్వాత జూబ్లీహిల్స్ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర కంటెస్టెంట్స్‌ బయటకు వచ్చిన సమయంలో విధ్వంస కాండ జరిగింది. అభిమానులు ఆర్టీసీ బస్సులను, ప్రైవేట్‌ వాహనాలను ధ్వంసం చేశారు. ఈ కేసులో ఇప్పటికే సాయి కిరణ్, రాజును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

పబ్లిక్‌ను గేదర్‌ చేయడం, న్యూసెన్స్ క్రియేట్ చేయడం, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం, తుంటరి చర్యలకు పాల్పడడం, పబ్లిక్ ప్రాపర్టీ డామేజ్ కింద పల్లవి ప్రశాంత్ పై కేసులు నమోదు అయ్యాయి. ఘటన సమయంలో రాళ్లదాడి జరుగుతుండడంతో అక్కడినుంచి ప్రశాంత్‌ను వెళ్ళిపోవాలని పోలీసులు కోరినా…అతడు వినకపోవడంతోనే కేసులు నమోదయ్యాయనేది పోలీస్‌ వెర్షన్‌.

పల్లవి ప్రశాంత్‌పై నమోదైన కేసులు

  • ఐపిసి 147 (పబ్లిక్‌గా గేదర్ అవ్వడం)
  • ఐపిసి 148 (హింసాత్మక ఆందోళన)
  • ఐపిసి 290 (పబ్లిక్‌గా న్యూసెన్స్ క్రియేట్ చేయడం)
  • ఐపిసి 353 (ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం)
  • ఐపిసి 427 (తుంటరి చర్యలకు పాల్పడడం)
  • ఐపిసి 149 (కూటమిగా నేరం చేయడం)
  • ఐపిసి 30 (హత్య)
  • ట్రాఫిక్ రూల్స్ 304-ఏ (పబ్లిక్ ప్రాపర్టీ డామేజ్)
Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top