Warangal: నిద్రలోనే బాలింతకు కార్డియాక్‌ అరెస్ట్‌.. చంటిబిడ్డకు శాశ్వతంగా దూరమైన తల్లి

95

వరంగల్‌ సీకేఎం ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో శుక్రవారం ఉదయం తెల్లవారుజామున గుండెపోటుతో బాలింత మృతి చెందింది. కుటుంబసభ్యులు, వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన బుస్స సుష్మిత (25) మొదటి కాన్పు ప్రసూతి వైద్యసేవల కోసం సీకేఎం హాస్పిటల్‌లో ఈనెల 13 చేరింది.

ఆదే రోజు సిజేరియన్‌ ద్వారా మగశిశువుకు జన్మనిచ్చింది. శిశువు అనారోగ్యంగా ఉండడంతో నవజాత శిశువుల వార్డులోని ఇంక్యుబేటర్లో ఉంచి వైద్యసేవలు అందిస్తున్నారు. తల్లి సుష్మితను ఐసీయూనుంచి 18న ప్రత్యేక వార్డుకు మార్చారు. శుక్రవారం ఉదయం సుమారు 4:30 గంటల సమయంలో సుష్మిత వెళ్లి శిశువుకు పాలు పట్టించి వచ్చి నిద్రపోయింది.

రెండో అంతస్థుపై నుండి ప్రమాదవశాత్తు కిందపడి గర్భిణి మృతి

తిరిగి రెండు గంటల అనంతరం బాబుకు పాలుపట్టాలని తల్లి నిద్రలేపే ప్రయత్నం చేయగా కదలకపోవడంతో వైద్యులను సంప్రదించారు. డ్యూటీ వైద్యులు వెంటనే పరీక్షించి సీపీఆర్‌ నిర్వహించినప్పటికీ ఫలితం లేకపోయింది. నిద్రలో కార్డియాక్‌ అరెస్ట్‌ కావడంతో సుష్మిత మృతి చెందినట్లు సీకేఎం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నిర్మలకుమారి తెలిపారు. మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top