భర్తను మరొకరికి ఇచ్చి పెళ్లి చేసింది.. చివరికి...

85

ఇప్పుడు మనం చెప్పుకునే స్టోరీ సినిమా కథ కాదు.. కానీ మూవీ లైనప్‌కు ఏ మాత్రం తీసిపోదు. కన్మణి రాంబో కతిజా మూవీలో హీరోలా 'నువ్వంటే ఇష్టం.. నువ్వు కూడా ఇష్టం'అంటూ ఇద్దరు అమ్మాయిలకు వల వేశాడు.

ఇద్దర్ని ముగ్గులోకి దింపాడు. ఇద్దరు అతడ్ని ప్రాణ ప్రదంగా ప్రేమించారు. అయితే సినిమా అంటే ట్విస్టు ఉండాలి కదా.. వీరి కథలోనూ అదిరిపోయే ట్విస్టు ఒకటి ఉంది. కట్ చేస్తే.. ఇప్పుడు అతడు జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు. ఆ ట్విస్ట్ ఏంటంటే.. అతడిని ప్రేమించిన యువతి కూడా జైలు పాలైంది. అసలు కథేంటంటే.. భర్తకు మరో యువతితో పెళ్లిచేసిందో మహిళ. తాను మోసపోయానని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు.

Malla Reddy: మంత్రి మల్లారెడ్డి నుంచి ప్రాణహాని ఉంది

పూర్తి వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్‌లోని సింగాడి కుంట బస్తీకి చెందిన ఓ యువతి (20) హోం ట్యూటర్‌గా పనిచేస్తుంది. యూసుఫ్‌గూడలోని ఓ డ్యాన్స్‌ అకాడమీలో శిక్షణ తీసుకొనేందుకు వెళ్లిన సమయంలో అక్కడ గాంధీ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారి తీసింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇంట్లో చెప్పడంతో పెళ్లికి పెద్దలు ఒప్పుకున్నారు. నిశ్చితార్థం కూడా అయిపోవడంతో కలిసి జీవిస్తున్నారు. ఈ సమయంలోనే గాంధీకి రోజా అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఆమెతో కూడా ప్రేమ వ్యవహారం నడుతుపుతున్నాడని అనుమానించింది ప్రేమికురాలు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పడంతో.. ఇరు కుటుంబ సభ్యులకు గొడవలు జరిగాయి. పంచాయతీ పోలీస్ స్టేషన్‌కు చేరింది.

అయితే తాము ఇద్దరం కేవలం స్నేహితులమని చెప్పుకోసాగారు. నిజమేనని నమ్మిన యువతి.. అతడితో పెళ్లికి అంగీకరించింది. మే 14న పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి పెద్దగా వ్యవహరించిన రోజా.. అన్ని దగ్గరుండి చూసుకుని పెళ్లి చేసింది. పెళ్లైన కొన్నాళ్ల వరకు కాపురం సజావుగా సాగిపోయింది. కొద్ది రోజుల తర్వాత గాంధీ ఇంటికి ఆలస్యంగా రావడం, ప్రశ్నిస్తే కొట్టడం ప్రారంభించాడు. ఇంతలోనే ఆమెకు అసలు విషయం తెలిసింది. రోజా, గాంధీ తమ పెళ్లి కన్నా ముందే వివాహం చేసుకున్నారని తెలిసి.. సదరు మహిళ లబోదిబోమంది. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గాంధీ, రోజాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top