పెళ్లికి సిద్ధమైన దగ్గుబాటి అభిరామ్.. శ్రీ రెడ్డి ఏం చేయబోతుంది..?

134

దగ్గుపాటి ఫ్యామిలీ ఇంట తాజాగా పెళ్లి సందడి మోగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. వెంకటేష్ అన్న సురేష్ దగ్గుబాటి రెండవ కుమారుడు అభిరామ్ కు పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లుగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి..

రానా తమ్ముడు అభిరామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. గతంలో శ్రీ రెడ్డి అతని పేరును ఎంతలా చెడగొట్టిందో కూడా తెలిసిందే.. ఈ ఇన్సిడెంట్ అభిరామ్ కెరియర్ కి చాలా దెబ్బతీసేలా చేసింది. ఇవేమీ జరగకుండా ఉంటే అభిరామ్ తెలుగు తెరకు ఎప్పుడు హీరోగా పరిచయం అయ్యే వారిని సమాచారం..

Singer Mangli : నడుము అందాలు చూపిస్తూ రచ్చ చేస్తున్న సింగర్ మంగ్లీ

కానీ అనుకోని సంఘటనలు జరగడంతో ఈ ఏడాది అహింస సినిమాతో తెలుగుతరకు ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా ఫెయిల్యూర్ గా మిగిలింది. ఈ నేపథ్యంలో దగ్గుబాటి కుటుంబం అతడికి పెళ్లి చేయాలనే ఆలోచనలు ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే అమ్మాయిని కూడా వెతికినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఈసారి రానా ల కాకుండా తమ బంధువుల అమ్మాయిని కోడలిగా తెచ్చుకోవాలని సురేష్ కుటుంబ సభ్యులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.అభిరామ్ చిన్నతాత కూతురు కూతురిని వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికీ ఇరువురు కుటుంబ సభ్యులకు కూడా పెళ్లి విషయంలో పలు చర్చలు పూర్తి చేసినట్లు సమాచారం. త్వరలోనే నిశ్చితార్థం జరగబోతుందని ఆ తర్వాత పెళ్లి తేదీని కూడా అఫీషియల్ గా ప్రకటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ విషయం తెలిసిన దగ్గుబాటి అభిరామ్ అభిమానులు సైతం ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.. మరి పెళ్లి తర్వాత అభిరామ్ లైఫ్ మారుతుందేమో చూడాలి.. మరి అభిరామ్ పెళ్లి విషయంపై వస్తున్న వార్తలపై శ్రీరెడ్డి ఎలాంటి కౌంటర్లు ఇస్తుందో అంటూ నేటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top