Revanth Reddy: రజిని జీతం ఎంతో తెలుసా?

413

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి ఉద్యోగం రజిని అనే దివ్యాంగురాలు పొందారు. ఈ అరుదైన అవకాశాన్ని దక్కించుకున్న ఆమె గతంలోనే రేవంత్ ను కలిశారు. ఎన్నికలకు ముందు పీసీసీ భవన్ లో కలిసి తన గోడును వెళ్లబోసుకున్నారు. ఆమె విషయంలో చలించిపోయిన రేవంత్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగం ఇస్తానని ఆమెకు హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్లుగానే తన హామీని నిలబెట్టుకున్నారు. కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం ఇచ్చారు.

హైదరాబాదులోని నాంపల్లి కి చెందిన రజిని దివ్యాంగురాలు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఎవరూ తనకు ఉద్యోగం ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సరిగ్గా ఎన్నికలకు ముందు రేవంత్ ను కలిసి తన బాధ చెప్పుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమెకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి సీఎం హోదాలో తొలి ఉద్యోగాన్ని ఇచ్చారు. ప్రమాణస్వీకారం అయిన తర్వాత దీనికి సంబంధించిన ఫైల్ పై సంతకం చేశారు.

Also Read: ఓటమి తర్వాత KCR ఫామ్‌హౌస్‌లో ఏం చేస్తున్నారో తెలుసా

అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్టు పద్ధతిలో రజినికి ఉద్యోగం దక్కింది. ఇప్పుడు అందరి దృష్టి రజినీపై మళ్లింది. తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రీయ ధ్రువీకరణ ఏజెన్సీలో ప్రాజెక్టు మేనేజర్ గా ఉద్యోగం దక్కింది. సోషల్ మీడియాలో ఆమెకు విస్తృత ప్రచారం వచ్చింది. ప్రధానంగా ఆమె జీతంపై రకరకాల చర్చ నడిచింది. రజినికి నెలకు రూ.50వేలు వేతనంగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలపై తొలి సంతకం చేయగా, రజినికి ఉద్యోగం ఇస్తూ తయారైన ఫైల్ పై రెండో సంతకం చేశారు.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top