Ap: విద్యుత్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు శుభవార్త

61

విద్యుత్‌ శాఖలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వారికి జీతాలు పెంచుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

విద్యుత్‌ శాఖలో ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది ఏళ్ల తరబడి జీతాల పెంపు కోసం ఎదురుస్తున్నారు. వారికి ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్‌ జీతాలను 37 శాతం మేర పెంచారు. దీంతో ఏడాది క్రితం చేరిన వారి నుంచి 15 ఏళ్లగా పనిచేస్తున్న ఉద్యోగుల వరకు అందరికీ ప్రయోజనం చేకూరింది.

AP Liquor Policy: మందు బాబులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్

1,110 మంది ఉద్యోగులు : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఆరు విద్యుత్‌ శాఖ డివిజన్‌ల పరిధిలో 240 సబ్‌స్టేషన్లు ఉన్నాయి. మొత్తం 1,110 మంది ఔట్‌ సోర్సింగ్‌లో పనిచేస్తున్నారు. వారిలో 150 మంది వరకు విద్యుత్‌ శాఖ కార్యాలయాల్లో కంప్యూటర్‌ ఆపరేటర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో వీరందరి జీతాలు పెరుగనున్నాయి. ప్రస్తుతం రూ.15 వేలు తీసుకుంటున్న వారు ఇకపై రూ.20 వేలు, రూ.21 వేలు తీసుకుంటున్న వారు రూ.28 వేలు, రూ.22 వేలు తీసుకుంటున్న వారు రూ.30 వేలు అందుకోనున్నారు.

సర్వత్రా హర్షాతిరేకాలు

ప్రభుత్వం జీతాలు పెంచడంతో విద్యుత్‌ శాఖ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారి దగ్గర నుంచి ఏడాది క్రితమే ఉద్యోగంలో చేరిన వారితో సహా అందరూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. జీతాలను ప్రభుత్వమే నేరుగా అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

37 శాతం వరకు జీతాల పెంపు

ఉమ్మడి జిల్లాలో 1,110 మందికి ప్రయోజనం

సీఎం జగన్‌ నిర్ణయంపై సర్వత్రా హర్షం

స్టార్ డైరెక్టర్ తో సమంత ఎఫైర్‌.. కట్ చేస్తే అతని భార్య చేతుల్లో తన్నులు...

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా

విద్యుత్‌ డివిజన్లు 6

సబ్‌స్టేషన్లు 240

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు 1,110

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top