how to earn money online for students - ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించడానికి 5 మార్గాలు

347

ప్రస్తుత సమాజం డిజిటల్ యుగంలోకి మారడంతో, డబ్బు సంపాదించడం సులభతరం అయింది. ఇంటి వద్ద నుండి ఆన్‌లైన్‌లో డబ్బుసంపాదించడం ఎలా అని మీరు ఆలోచిస్తుంటే, ఈ పోస్ట్ లో మీకు అవసరమైన నైపుణ్యాలతో ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి

Freelancing – ఫ్రీలాన్సింగ్ :

ఫ్రీలాన్సింగ్ అనేది ఆన్లైన్లో డబ్బు సంపాదించడానికి అత్యంత ఆదరణ పొందిన మార్గాలలో ఒకటి. writing-వ్రాయడం, Translation-అనువాదం, coding-కోడ్, Design-డిజైన్ చేయడం వంటి స్కిల్స్ ఉంటే, మీరు ఫ్రీలాన్సింగ్‌లో డబ్బు సంపాదించవచ్చు. విద్యార్థులు డబ్బు సంపాదించడానికి అనేక ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. అప్వర్క్, ఫైవర్ర్ వంటి పలు వెబ్సైట్లు విద్యార్థులకు డబ్బు సంపాదించటంలో సహాయపడతాయి.

Online Data Entry - డేటా ఎంట్రీ :

విద్యార్థులకు ఇంటి నుండి డబ్బు సంపాదించే మార్గాలలో ఇది ఒకటి. ఈ ఉద్యోగానికి ప్రత్యేకంగా టెక్నికల్ స్కిల్స్ అవసరం లేదు. మీరు కంప్యూటర్‌ మరియు మొబైల్స్ ఉపయోగించి Online Data Entry- డేటా ఎంట్రీ ఉద్యోగం చేస్తూ డబ్బు సంపాదించవచ్చు ఇంటి నుండి ఆన్లైన్ డేటా ఎంట్రీ ఉద్యోగాలను కనుగొనడానికి వివిధ వెబ్‌సైట్‌లు అందుబాటులో ఉన్నాయి.

Dropshipping - డ్రాప్‌ షిప్పింగ్‌ :

తక్కువ పెట్టుబడితో ఆన్లైన్ ఈ కామర్స్‌ వెబ్సైటెను రన్‌ చేయడమే డ్రాప్‌ షిప్పింగ్‌. కేవలం కస్టమర్‌ నుంచి ఆర్డర్‌ తీసుకొని ఆ ఆర్డర్‌ను ఫుల్‌ఫిల్‌ చేయటమే, అంటే ప్రొడక్ట్‌ మనది కాదు. డెలివరీ కూడా మనం చేయం. కానీ మనకు లాభం వస్తుంది. దీనినే డ్రాప్‌ షిప్పింగ్‌ బిజినెస్‌ అంటారు. మీ డ్రాప్ షిప్పింగ్ వ్యాపారాలను ప్రారంభించగల కొన్ని టాప్ వెబ్సైట్లు ఇక్కడ ఉన్నాయి:

• Shopify • TopDaqg • Oberlo • FondMart • Eprolo • DropshipForSale • glowroad • Meesho

Blogging – బ్లాగింగ్ :

బ్లాగింగ్ అనేది వ్యక్తులు లేదా సంస్థల యొక్క ఆలోచనలు, కథనాలు, ఫోటోలు, అనుభవాలను మరియు వివిధ రకాల కంటెంట్‌లను వెబ్‌సైట్‌లో ప్రచురించడాన్ని బ్లాగింగ్ అంటారు. ఆన్లైన్లో ట్రెండింగ్ అవుతున్న మరియు ఆసక్తికర అంశాలను ఎంచుకొని, వాటిపై కథనాలు రాస్తూ బ్లాగులో పోస్ట్ చేస్తూ ప్రకటల నుంచి ఆదాయం పొందొచ్చు.

Photography :

మీకు ఫోటోగ్రఫీపై ఆసక్తి ఉంటే, మీరు ఫోటోగ్రఫీ వెబ్సైట్లలో మీ ఫోటోలను విక్రయిస్తూ డబ్బు సంపాదించవచ్చు. షట్టర్స్టాక్ లేదా ఐస్టాక్ వంటి వెబ్ సైట్స్ నుండి ఎవరైనా మీ ఫోటోను డౌన్లోడ్ చేసిన ప్రతిసారీ, మీరు కమీషన్ పొందుతారు. మీ సొంత ఫోటోగ్రఫీ బ్లాగింగ్ ద్వారా ఫోటోగ్రఫీ గురించి మీయొక్క అనుభవాలను, కథనాలు, చిత్రాలు మరియు వీడియోలను పోస్ట్ చేస్తూ స్పాన్సర్‌షిప్‌లు, ప్రకటల నుంచి ఆదాయం పొందొచ్చు. మీ ఫోటోలను ఆన్లైన్లో విక్రయిస్తూ డబ్బు సంపాదించగల కొన్ని టాప్ వెబ్సైట్లు ఇక్కడ ఉన్నాయి:

• Vecteezy • Shutterstock • Freepik • iStock • Getty Images • Stocksy • Crestock • BigStock • Pexels • Dreamstime • Unsplash

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top