Farmers: వరి నాట్లకు కూలీల కొరత.. భారీగా పెరిగిన కూలీ ధరలు.

42

తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. వర్షాలు బాగానే పడుతుండడంతో చాలా మంది రైతలు వరి సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దాదాపు అందరు రైతులు వరి నాట్లు వేస్తున్నారు. దీంతో ఊళ్లలో కూలీల కొరత ఏర్పడింది. కూలీలకు డిమాండ్ పెరగడంతో.. కూలీ కూడా పెరిగింది. సాధారణ రోజుల్లో రూ.250 ఉండే కూలీ.. ఇప్పుడు రూ.500 లకు చేరింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. రూ.500 చెల్లించిన కూలీలు దొరకడం లేదని అన్నదాతలు చెబుతున్నారు.

చాలా మంది పక్క గ్రామాల నుంచి కూలీలను తీసుకొచ్చి నాట్లు వేయిస్తున్నారు. గతంలో ఎకరం పొలడం నాటు వేయడానికి రూ.3 వేల నుంచి 4 వేలు ఖర్చు అయ్యేది. ఇప్పుడు రూ.5 వేల నుంచి 6 వేల ఖర్చు వస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. తెలంగాణ కూలీలే కాకుండా బీహర్ చెందిన కూలీలు కూడా నాట్లు వేస్తున్నారు. దీంతో వారికి కూడా డిమాండ్ పెరిగింది.

నైగర్‌లో సైన్యం తిరుగుబాటు: ప్రవాసాంధ్రుల కోసం ఏపీ సర్కారు కీలక నిర్ణయం గతంలో పొలం వద్దకు కూలీలే నడిచి వచ్చే వారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కూలీలను పొలం వద్ద తీసుకెళ్లేందుకు ఆటోల సౌకర్యం కల్పించాల్సి వస్తుంది. ఇలా రైతులకు ఖర్చు పెరిగిపోతుంది. కూలీలకు రైతులే భోజన సౌకర్యం కల్పించాల్సి వస్తుంది.

రైతు కూలీల కొరత ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, మెదక్ జిల్లాల్లో ఎక్కువగా ఉంది. ఆడ కూలీలకు రూ.500 చెల్లిస్తుంటే.. మగ కూలీలకు రూ.1000 చెల్లిస్తున్నారు. Recommended Video TTD Chairman భూమన కరుణాకర్ రెడ్డి Biography... వరి కోయడానికి యంత్రాలు ఉన్నాయి.. కానీ నాటు వేయడానికి యంత్రాలు ఉన్నా.. విరివిగా వాడకంలోకి రావడం లేదని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. రైతులు వరి కాకుండా పత్తి, మొక్కజొన్న వంటి పంటలు కూడా వేయాలని సూచిస్తున్నారు. ఈసారి సన్న వడ్ల వరి సాగు తగ్గే అవకాశం ఉందన్నారు. సన్న వడ్ల కంటే దొడ్డు వడ్లు దిగుబడి ఎక్కువ వస్తుండడం దీనికి కారణంగా చెబుతున్నారు.
 

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top