లక్స్ ఇండస్ట్రీస్ కార్యాలయంపై ఐటీ దాడులు.. కుప్పకూలిన స్టాక్..

158

దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ & ఇన్నర్ వేర్ తయారీ కంపెనీ లక్స్‌కు చెందిన పలు ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, దిల్లీ కార్యాలయాలు, తయారీ ప్లాంట్లపై ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.

కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ ప్రమోటర్ల ఇళ్లపై కూడా ఐటీ దాడులు కొనసాగాయి. రూ.200 కోట్ల మేర పన్ను ఎగవేత జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వార్తలతో కంపెనీ షేర్లు మార్కెట్లో 3 శాతానికి పైగా పతనమయ్యాయి. మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో రూ.1,465.75 వద్ద ఎన్ఎస్ఈలో కొనసాగుతోంది. ఏడాది వ్యవధిలో 20 శాతానికి పైగా స్టాక్‌ పడిపోయింది.

Also Read: కోటీశ్వరుడు కావాలనుకుంటున్నారా..? అయితే ఈ సూత్రం తెలుసుకోండి

ఈ కంపెనీని ముందుగా బిస్వనాథ్ హోసిరీ మిల్స్ అని పిలిచేవారు. ఇది దేశంలోని ప్రముఖ లోదుస్తుల తయారీ సంస్థగా గుర్తింపు పొందింది. వ్యాపారంలో ఒత్తిడి కారణంగా లక్స్ కంపెనీ లాభాలపై ప్రభావం పడింది. జూన్ తో ముగిసిన త్రైమాసికంలో గత ఏడాదితో పోల్చేతే లాభం 57 శాతం మేర పడిపోయింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన(YoY) 57 శాతం తగ్గి రూ.44 కోట్లకు చేరుకుంది. అదే కాలంలో కంపెనీకి వచ్చే ఆదాయం 23 శాతం పెరిగి రూ.715 కోట్లకు చేరుకుంది. లక్స్ ఇండస్ట్రీస్ ఇన్నర్‌వేర్, హోజరీ సంబంధిత దుస్తుల ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ వ్యాపారంలో నిమగ్నమై ఉంది. లక్స్ కోజీ, లక్స్ వీనస్, లక్స్ కాట్స్ వూల్ వంటి వివిధ బ్రాండ్ పేర్లతో లోదుస్తులు, చొక్కాలు, బ్రీఫ్‌లు, థర్మల్ వేర్ వంటి అనేక రకాల ఉత్పత్తులను కంపెనీ విక్రయిస్తోంది.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top