Jabardasth Avinash: త్వరలోనే తండ్రి కాబోతున్న జబర్దస్త్ కమెడియన్

123

ప్రముఖ కమెడియన్, జబర్దస్త్ ఫేమ్ అవినాష్ త్వరలోనే తండ్రిగా ప్రమోషన్ పొందనున్నాడు. అతని భార్య అనూజ త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. అవినాష్‌-అనూజ దంపతులు 2021 అక్టోబర్‌లో వివాహం చేసుకున్నారు. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. అవినాష్‌-అనూజల అన్యోన్య దాంపత్య బంధానికి గుర్తింపుగా ఈ ఏడాది జులై లో అనూజ గర్భం దాల్చింది. ఈ విషయాన్ని అవినాశ్‌ దంపతులే సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు.

అనుజ సీమంతం వేడుకలు కొన్ని రోజుల క్రితమే ఘనంగా జరిగాయి. జబర్దస్త్ కమెడియన్లతో పాటు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. అవినాశ్‌-అనూజ దంపతులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. తాజాగా అవినాష్ దంపతులు మెటర్నిటీ ఫొటోషూట్‌లో మెరిశారు. కలర్ ఫుల్ డ్రెస్‌లో ఎంతో గ్లామరస్‌గా, బ్యూటిఫుల్‌గా కనిపించారు ఈ లవ్లీ కపుల్. వీటికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు అవినాష్ దంపతులు.

Also Read: అజ్ఞాతంలో పల్లవి ప్రశాంత్

ఈ సందర్భంగా అవినాశ్ సతీమణి అనూజ అమ్మతనాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నానంటూ పేర్కొంది. "గర్బంలో బిడ్డను మోయడమనేది నా జీవితంలో ఒక అందమైన మరుపురాని అనుభూతి. ఈ ప్రేమ నిజమైనది, శాశ్వతమైనది. అమ్మతనాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నాను" అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చింది అనూజ. ప్రస్తుతం అవినాష్‌-అనూజ దంపతుల మెటర్నిటీ ఫొటోషూట్ ఫొటోస్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. పలువురు బుల్లితెర ప్రముఖులు, బిగ్ బాస్ కంటెస్టెంట్స్, అభిమానులు, నెటిజన్లు అవినాష్ దంపతులకు అభినందనలు చెబుతున్నారు.

అవినాష్ ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ ప్రసాద్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top