జియో పర్సనల్ లోన్స్.. మూడు లక్షల వరకు రుణం పొందండి

139

జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు చెందిన రుణ సంస్థ జియో ఫైనాన్స్ డిజిటల్ పర్సనల్ లోన్లను ఆఫర్ చేస్తోంది. మొదటగా పర్సనల్ లోన్లు, కన్జూమర్ డ్యూరబుల్ లోన్లు, మర్చంట్ ట్రేడ్ క్రెడిట్ ఫెసిలిటీ లోన్లను ప్రారంభించింది. జియో ఫైనాన్స్ సహా మైజియో మొబైల్ అప్లికేషన్ల ద్వారా వేతన జీవులు (శాలరీడ్), సెల్ఫ్ ఎంప్లాయిడ్ (స్వయం ఉపాధి) వారికి డిజిటల్‌గా వ్యక్తిగత రుణాలు అందిస్తోంది. 23 నుంచి 58 సంవత్సరాల వరకు వారికి గరిష్టంగా 3 లక్షల రూపాయల వరకు లోన్ ఆఫర్ చేస్తుండటం విశేషం.

ఇక ఈ లోన్ పొందాలంటే.. దరఖాస్తు దారులకు పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇంకా ఆధార్‌ కార్డుతో అనుసంధానమై ఉన్న మొబైల్ నంబర్ ఉంటే సరిపోతుంది. లోన్ ఈజీగా వేగంగా పొందొచ్చు. కన్జూమర్ డ్యూరబుల్ లోన్ల కింద ఖరీదైన మొబైల్ ఫోన్స్, AC లు, కెమెరా కొనుగోళ్ల కోసం రుణాల్ని ఆఫర్ చేస్తోంది. మర్చంట్ వెబ్‌‌సైట్లపై నో కాస్ట్ EMI ఆప్షన్ కింద ఈ ప్రొడక్ట్స్ కొనుగోలు చేసుకోవచ్చు కూడా.

  Mansoor Ali Khan: నాది వక్రబుద్ది అయితే.. చిరంజీవిది ఏంటి మరి.. ?

'జియో ఫైనాన్స్.. కన్జూమర్ డ్యూరబుల్స్ లోన్లు అందిస్తోంది. తయారీదారులు, OEM లు లేదా డీలర్స్ ఈ లోన్లపై వడ్డీని భరిస్తారు. దీంతో నో- కాస్ట్ ఈఎంఐ ప్రయోజనాన్ని కస్టమర్లు పొందొచ్చు. కాకుంటే.. కస్టమర్లు ప్రాసెసింగ్ ఫీజు మాత్రం చెల్లించాల్సి ఉంటుంది.' అని తెలిపింది జియో ఫైనాన్స్. వ్యాపారాలు చేసే వారికి కూడా జియో ఫైనాన్స్

లోన్లు ఇవ్వడం ప్రారంభించింది. అన్ సెక్యుర్డ్ మర్చంట్ ట్రేడ్ క్రెడిట్ సదుపాయాన్ని తన ప్లాట్‌ఫాంపై నమోదైన వర్తకులకు అందించనుంది. జియో ఫైనాన్షియల్ రిలయన్స్ నుంచి విడిపోయి.. ఎక్స్చేంజీల్లో లిస్టయింది. మ్యూచువల్ ఫండ్స్ సహా ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సేవల్ని సైతం ఈ సంస్థ త్వరలోనే అందించనుంది.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top