కాజల్ రెండో పెళ్లి? పెళ్లి బట్టల్లో ఫోటో షేర్ చేసిన కాజల్..

166

తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటి కాజల్ పసుపతి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కో, మౌన గురు, కథమ్ కథమ్ వంటి విజయవంతమైన సినిమాలతో ఆమె తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో కూడా అల్లు శిరీష్ డెబ్యూ సినిమా ‘గౌరవం’ తో ఆమె మెప్పించింది. 2008లో ప్రముఖ కొరియోగ్రాఫర్ శాండీ మాస్టర్‌ను ప్రేమ వివాహం చేసుకున్న కాజల్, 2012లో విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత శాండీ మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.

తాజాగా కాజల్ పెట్టిన ఒక పోస్ట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. పెళ్లి బట్టల్లో ఉన్న ఫొటో షేర్ చేస్తూ, “ఫైనల్‌గా రెండో పెళ్లి చేసుకున్నా. నన్ను క్షమించండి ఫ్రెండ్స్. అందరూ క్షేమంగా ఉన్నారనే ఆశిస్తున్నా” అని ఆమె పోస్ట్ చేసింది. కాజల్ పెట్టిన ఈ పోస్ట్‌తో ఆమె రెండో పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆమె భర్తను మాత్రం ఆమె పోస్ట్‌లో రివీల్ చేయలేదు. దీంతో ఆమె నిజంగా రెండో పెళ్లి చేసుకుందా లేక ఏదైనా మూవీ ప్రమోషన్ కోసం ఈ పోస్ట్ పెట్టిందా అని ప్రశ్నలు వస్తున్నాయి.

కాజల్‌పై సినీ పరిశ్రమలోనూ, నెటిజన్లలోనూ భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమె నిజంగా రెండో పెళ్లి చేసుకుందని భావిస్తున్నారు. మరికొందరు ఆమె ఈ పోస్ట్‌తో కేవలం హైప్‌క్రియేట్ చేస్తున్నట్లు భావిస్తున్నారు.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top