kingfisher Beer : కింగ్ ఫిషర్ బీర్ లో నిషేధిత ఉత్ప్రేరకం... తాగితే ఇంకా అంతే..

128

కింగ్ ఫిషర్ బీర్ తాగే వారికి షాకింగ్ న్యూస్. మద్యం సేవించేటప్పుడు కానీ, పార్టీ చేసుకునేటప్పుడు కానీ మీ ఛాయిస్ కింగ్ ఫిషర్ బీర్ అయితే ఈ వార్త మీకు కొంచెం భయాన్ని కలిగించవచ్చు.

ఎందుకంటే, కింగ్ ఫిషర్ బీర్ లో నిషేధిత ఉత్ప్రేరకం (సెడిమెంట్స్) గుర్తించారు అధికారులు. అవి మనుషులు తాగితే ప్రాణాలకే ప్రమాదం కావచ్చు.

Singer Mangli : నడుము అందాలు చూపిస్తూ రచ్చ చేస్తున్న సింగర్ మంగ్లీ

కర్నాటక రాష్ట్రం మైసూర్ జిల్లా నంజన్ గడ్ లోని యునైటెడ్ బ్రూవరీస్ లో 7సీ, 7ఈ బ్యాచ్ నెంబర్ తో తయారైన కింగ్ ఫిషర్ స్ట్రాంగ్, కింగ్ ఫిషర్ అల్ట్రా లాంగర్ బీర్లలో ప్రమాదకర రసాయనాలు ఉన్నట్లు కెమికల్ పరీక్షల్లో తేలింది. జూలై 17,2023న యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ నంజన్‌గడ్ యూనిట్‌లో తయారు చేయబడిన బీర్లలలో ప్రమాదకర రసాయనాలు ఉన్నట్లు నంజన్‌గడ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జూలై 28న ఫిర్యాదు చేశారు. దీంతో వాటిని కెమికల్ టెస్ట్ కోసం పంపారు. ల్యాబ్ టెస్ట్ రిపోర్టు వచ్చే వరకు స్టాక్ ను సీజ్ చేయాలని ఆదేశించారు.

అయితే దీనికి సంబంధించిన రిపోర్టు ఆగస్ట్ 2 న వచ్చింది. ఆ బీర్లలో నిషేధిత ఉత్ప్రేరకం ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధారించారు. 7సీ, 7ఈ బ్యాచ్ నెంబర్ తో తయారైన కింగ్ ఫిషర్ స్ట్రాంగ్, కింగ్ ఫిషర్ అల్ట్రా లాంగర్ బీర్లు ఉపయోగానికి పనికి రావని, వాటిని తాగితే ప్రమాదమని పరీక్షల్లో తేలింది. దీంతో రసాయన పరీక్ష నివేదికలో విఫలమైన స్టాక్‌ను ధ్వంసం చేయాలని అధికారులను ఆదేశించింది ఎక్సైజ్ శాఖ. అక్కడ తయారైన రూ.25 కోట్ల విలువైన 78వేల 678 బీరు బాక్సులను సీజ్ చేశారు. వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా బీర్‌ల అమ్మకాలను నిలిపివేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశించింది.

Renu Desai : పవన్ అందుకే తరిమేశాడు... కౌంటరిచ్చిన రేణు దేశాయ్..

అయితే మొత్తం 78వేల 678 బాక్సులను ఉత్పత్తి చేయగా వాటిలో 45వేల 500 వరకు ఇప్పటికే సరఫరా చేశారు. బెంగళూరులోనే దాదాపు 11వేల సీసాలు సప్లయ్ అయ్యాయి. దీంతో ఆ ప్రాంతాల్లో కింగ్ ఫిషర్ బీర్ ల అమ్మకాలను నిలిపివేయాలని ఆదేశించడంతో పాటు వీటిని తయారుచేసిన యునైటెడ్ బ్రూవరీస్ పై కేసు నమోదు చేశారు. ఈ బీరులో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయని తెలియడంతో వీటిని తాగాలంటేనే మద్యం ప్రియులు భయానికి గురవుతున్నారు.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top