రైల్లో దొంగతనానికి వెళ్లి... చావు అంచున 80కి.మీ వేగంతో ప్రయాణం

104

వేగంగా వెళ్తున్న రైలు కిటికీకి దొంగ వేలాడుతున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. కిటికీకి వేలాడుతున్న దొంగ సాయం కోసం కేకలు వేయడం వీడియోలో చూడొచ్చు.

Also Read: ఈటల రాజేందర్కు తప్పిన ప్రమాదం..

ఈ వీడియో నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఈ సంఘటన బీహార్‌ రాష్ట్రంలోని బెగుసరాయ్ ప్రాంతంలో జరిగింది. రైలు కిటికీకి వేలాడుతున్న దొంగ చోరీకి పాల్పడేందుకు స్టేషన్‌లో ఆగి ఉన్న రైలు వద్దకు చేరుకున్నాడు. ఈ క్రమంలో రైలులోపల ఉన్న ఎవరో అతడిని చూసి పట్టుకున్నారు. అదే సమయంలో రైలు కదలడం ప్రారంభించింది. తప్పించుకునే దారి లేక దొంగ కిటికీకి వేలాడుతూ ప్రాణాపాయ స్థితిలో ప్రయాణించాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, దొంగ క్షమాపణలు చెప్పడం చూడవచ్చు.

దొంగ రైలు కిటికీకి కొన్ని కిలోమీటర్ల దూరం వరకు అలాగే ప్రయాణించాడు. కదులుతున్న రైలులో దొంగ స్వయంగా గ్రిల్ పట్టుకోగా, లోపల ఉన్నవారు కూడా కిందపడకుండా అతడి చేయి పట్టుకున్నారు. బచ్వాడ జంక్షన్‌కు చేరుకునే వరకు అలాగే ప్రయాణం సాగింది. రైలు ఆగిన తర్వాత ప్రయాణికులు దొంగను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌కు అప్పగించారు.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top