యాదాద్రి: ఇక నుంచి కొండపైకి ఆటోల అనుమతి

173

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి భక్తులకు ఉపశమనం కలిగించే వార్త చెప్పింది ప్రభుత్వం. గుట్టపైకి వెళ్లేందుకు ప్రభుత్వం ఉచిత బస్సులు నడపిస్తుండగా.. ప్రత్యేక రుసుముతో ప్రైవేటు వాహనాలను అనుమతిస్తున్నారు. అయితే.. ఆటోలకు మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు. కాగా.. ఈరోజు అంటే ఫిబ్రవరి 11 నుంచి గుట్టపైకి ఆటోలను కూడా అనుమతిస్తున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు పచ్చజెండా ఊపి ఆటోల రాకపోకలను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పునరుద్ధరించారు. దీంతో.. ఇక నుంచి గుట్టపైకి ఎప్పటిలాగానే ఆటోలు కూడా నడవనున్నాయి.

యాదగిరిగుట్ట ప్రధానాలయం పునఃప్రారంభం సందర్భంగా గత ప్రభుత్వం.. 2022 మార్చి 28న కొండపైకి ఆటోలను నిషేధించిన విషయం తెలిసిందే. అయితే.. గుట్టపైకి ఆటోలను అనుతించాలంటూ.. ఆటో డ్రైవర్లు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఘాట్ రోడ్డు సమీపంలో యాదరుషి విగ్రహం వద్ద దాదాపుగా 20 నెలల పాటు దీక్షలు కొనసాగిస్తున్నారు.

అయితే.. మధ్యలో అసెంబ్లీ ఎన్నికలు రావటంతో కోడ్ నిబంధనల కారణంగా.. పోలీసుల సూచన మేరకు 2023 నవంబర్‌‌‌‌లో దీక్షలు విరమించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత.. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఆటో డ్రైవర్లు, ఆలయ ఉద్యోగులు, పోలీసులతో పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించారు. సాధ్యాసాధ్యాలపై అధికారులతో చర్చలు జరిపిన ప్రభుత్వం.. ఈ నెల 11 నుంచి కొండపైకి ఆటోలను అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆటో డ్రైవర్ల రెండు ఏళ్ల సుధీర్ఘ నిరీక్షణకు తెరపడింది. అటు.. బస్సుల్లో వెళ్లలేని భక్తులకు కూడా ఒకింత ఉపశమనం దొరికినట్టయింది.  

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top