వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ఉమ్మడి రాజధానిపై కీలక వ్యాఖ్యలు

166

ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిలను కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమకం తర్వాత ఏపీ ప్రత్యేక హోదా చర్చనీయాంశంగా మారింది. వైయస్ షర్మిల తన ప్రచారంలో భాగంగా టిడిపి, వైసిపి నేతలు ఏపీ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో న్యాయం జరగాలంటే కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని షర్మిల ఏపీ ప్రజలను కోరారు. మరోవైపు వైపు వైసీపీ నేతలు షర్మిలపై విమర్శలను గుప్పిస్తూ విభజన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే  ఏపీ ప్రత్యేక హోదాను ఎందుకు చట్టపద్ధత చేయలేదని ప్రశ్నిస్తున్నారు. ఈ సమయంలో వై వి సుబ్బారెడ్డి చేసిన విమర్శలను ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి ఏపీలో త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికలలో వైసీపీ తరఫున బరిలో దిగారు సోమవారంనాడు నామినేషన్ కూడా దాఖలు చేశారు ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఏపీ ప్రత్యేక హోదా విషయంపై వైసీపీ ప్రభుత్వం పోరాటం చేస్తుందని చెప్పారు. అలాగే విభజన అంశం లోని హామీలపై రాజ్యసభలో తమ సభ్యులతో కలిసి ఒత్తిడి చేస్తామని అని తెలియజేశారు. అలాగే విశాఖపట్నంలోని పరిపాలన రాజధాని ఏర్పాటు చేసేంత వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు అనే అంశంపై కేంద్రంతో చర్చిస్తామని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఇదే సమయంలో ఏపీలో ప్రస్తుతం రాజధాని నిర్మాణం చేపట్టే పరిస్థితి లేదని వైపి సుబ్బారెడ్డి తెలియజేశారు

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top