Blood Pressure : రక్తపోటును నియంత్రణలో ఉంచేందుకు వాల్ నట్స్ తీసుకోవటం మంచిదా ?

129

Blood Pressure : అధిక రక్తపోటు అనేది గుండె జబ్బులు, స్ట్రోక్‌లకు ప్రధాన ప్రమాద కారకం. అధిక రక్తపోటు నివారణ , నిర్వహణలో ఆరోగ్యకరమైన ఆహారం ముఖ్యమైన భాగం. తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, లీన్ మాంసాలు, కాయలు , గింజలు పుష్కలంగా తినడం, సంతృప్త కొవ్వు , ఉప్పు అధికంగా ఉన్న ఆహారాన్ని తగ్గించడం వల్ల రక్తపోటు తగ్గుతుందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

గుండెకు ఆరోగ్యకరమైన ఆహారంగా గింజలు ఎంతగానో ఉపయోగపడుతున్నట్లు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనల్లో స్పష్టమౌతుంది. అయితే వాల్ నట్స్ అనే ఒక నిర్దిష్ట రకం గింజలు ఎక్కువ తీసుకోవడం అన్నది రక్తపోటును మెరుగుపరచడంలో సహాయపడుతున్నట్లు తేలింది. వాల్‌నట్‌లు ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ (ALA) అని పిలువబడే బహుళఅసంతృప్త ఒమేగా-3 కొవ్వు ఆమ్లం యొక్క గొప్ప మూలం. ఇతర రకాల చెట్ల గింజల కంటే ఎక్కువ మొత్తంలో ఆరోగ్యానికి మేలు కలిగించే సమ్మేళనాలు దీనిలో ఉంటాయి.

ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ అధికంగా ఉన్న ఆహారాలు రక్తపోటును తగ్గించడానికి సహయపడతాయి. కాబట్టి ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడటానికి ఆహారంలో ఎక్కువ వాల్‌నట్‌లను చేర్చడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఆహారంలో వాల్‌నట్‌లు రోజుకు 57 నుండి 99 గ్రాములు తీసుకోవాలి. వాల్‌నట్‌లలో అదే మొత్తంలో ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ ఉంటుంది. ప్రతిరోజూ వాల్‌నట్‌లను తినేవారిలో రక్తపోటు క్రమేపి తగ్గుతుందిని అద్యయనాల్లో తేలింది. సెంట్రల్ బ్లడ్ ప్రెజర్ అనేది గుండె వంటి అంతర్గత అవయవాలపై కలిగించే ఒత్తిడి హృదయ సంబంధ వ్యాధులకు ముఖ్యమైన ప్రమాద కారకంగా పరిగణించబడుతుంది.

వాల్‌నట్స్‌లో ఫైబర్‌తో పాటు అనేక రకాల బయోయాక్టివ్ ఫినాలిక్ సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి రక్తపోటును తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. అదే క్రమంలో వాల్‌నట్‌లు అధికంగా ఉండే ఆహారం తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ అనగా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. సాధారణ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వాల్‌నట్‌లను తినడం వల్ల అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top