చంద్రబాబు అరెస్ట్ - విజయవాడకు తరలింపు..!!

122

రాష్ట్ర రాజకీయాల్లో కలకలం. టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేసారు. నంద్యాలలో ఉన్న చంద్రబాబు బస చేసిన క్యాంపు వద్దకు పోలీసులు అర్ద్రరాత్రి తరువాత చేరుకున్నారు.

ఆ సమయంలో పెద్ద ఎత్తున గందరగోళం చోటు చేసుకుంది. తనను అరెస్ట్ చేసేందుకు కారణాలు ఏంటో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేసారు. దీంతో అరెస్ట్ కు సంబంధించిన పేపర్లను..వివరాలను అందించిన పోలీసులు చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు.

తెలుగుదేశం అధినేత చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను విజయవాడకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. నంద్యాలలో బస చేసిన చంద్రబాబు బస్సు వద్దకు పెద్ద ఎత్తున పోలీసులు వచ్చారు ఆయనను అదుపులోకి తీసుకుంటున్నట్లు చెప్పారు.

Also Read: షర్మిల రాజకీయ జీవితం ముగిసినట్లే...

ఆ సమయంలో తన హక్కులు ఎందుకు ఉల్లంఘిస్తున్నారంటే చంద్రబాబు పోలీసులను ప్రశ్నించారు. ఏ చట్ట ప్రకారం తనను అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రాథమిక ఆధారాలు లేకుండా ఎలా అదుపులోకి తీసుకుంటున్నారని నిలదీశారు. తాము హైకోర్టుకు ప్రాథమిక ఆధారాలు ఇచ్చామని పోలీసులు తెలిపారు.

చంద్రబాబు తరఫున న్యాయవాదులు పోలీసులతో వాదించారు. ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. రిమాండ్ రిపోర్ట్ లో అన్నీ ఉన్నాయని వివరించారు. శనివారం తెల్లవారుజాము చంద్రబాబు బస చేసిన ప్రాంతానికి పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. అనంతపురం నుంచి అదనపు బలగాలను రప్పించారు ఎక్కడికి అక్కడ చెక్పోస్ట్లను ఏర్పాటు చేశారు.

చంద్రబాబు హాయంలో జరిగిన స్కిల్ డెవలప్ మెంట్ లో జరిగిన కుంభకోణం పై సీఐడీ, ఈడీ విచారణ చేసారు. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు పాత్ర పై చాలా రోజులుగా వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

Also Read: లక్ష వరకు రుణమాఫీ.. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

ఈ వ్యవహారంలో ఇప్పటికే అటాచ్ మెంట్లు జరిగాయి. షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఏడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు. దీంతో, ఈ కేసులో మరి కొంత మందిని అదుపులోకి తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. చంద్రబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షల తరువాత విజయవాడకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

రెండు రోజుల క్రితం తనను అరెస్ట్ చేయవచ్చంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీసాయి. ఇప్పుడు స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబును అదుపులోకి తీసుకోవటంతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top