RK Roja: బాలకృష్ణ ఓ మెంటల్ గాడు... మంత్రి రోజా

97

చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆయన బావమరిది, టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వం మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ ప్రెస్ మీట్ గురించి స్పందించిన మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ గారి ప్రెస్ మీట్ చూసిన ప్రతి ఒక్కరూ ఇన్ని రోజులు వెన్నుపోటు దారుడు ఆ సీట్లో కూర్చున్నాడు, ఇప్పుడు మెంటల్ గాడు కూర్చున్నాడు అనుకుంటున్నారు. అది నేను చెప్పిన మాట కాదు, ఎందుకంటే బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు జరిపినప్పుడు బాలకృష్ణ గారు కోర్టుకు సమర్పించిన తన ఆఫడిఫిట్ లో తానే నేను మానసిక వ్యాధిగ్రస్తుడిని ఈ దేశంలో ఉన్న నాలుగు మెంటల్ హాస్పిటల్స్ లో చికిత్స తీసుకుంటున్నాను అని సెల్ఫ్ సర్టిఫైడ్ సైకోగా ఆయన ఆఫడిఫిట్ ఇచ్చారని అన్నారు. అలాంటి మెంటల్ స్టేటస్ ఉన్న బాలకృష్ణ గారు ఈరోజు నేను తెలుగువారి కోసం తెలుగుదేశం పార్టీ కోసం పోరాడుతాను అంటే ఆ తెలుగుదేశం పార్టీ వారందరూ మా పరిస్థితి ఏమైపోతుందో అని భయపడుతున్నారు.

Also Read: ఎన్టీఆర్‌ పెళ్లి రోజు X చంద్రబాబు పెళ్లి రోజు

పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుంది మా పరిస్థితి అని మాట్లాడుకుంటున్నారని రోజా పేర్కొన్నారు. ఈరోజు బాలకృష్ణ గారికి నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, తెలుగు వారి కోసం పోరాడుతాను తెలుగు వాడి పౌరుషం ఏంటో చూపించండి అంటున్నారు కదా ఈరోజు దొంగలాగా సాక్షాధారాలతో దొరికిన మీ బావ కోసం నువ్వు పోరాడితే తెలుగువారి కోసం తెలుగు వారి పౌరుషం కోసం పోరాడినట్లు కాదని అన్నారు. నీ తండ్రి ఎన్టీ రామారావు గారు తెలుగువాడి పౌరుషం ఏంటో ఢిల్లీకి చూపించే విధంగా తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగు వారికి అండగా ఉంటే ఆయన దగ్గర నుంచి పార్టీ లాక్కొని వైస్రాయ్ హోటల్ లో ఆయనపై చెప్పులు వేసి, అసెంబ్లీలో ఆయన వద్ద మైక్ లాక్కుని ఆయన కంటి నీరు వచ్చేలా చేసిన చంద్రబాబు మీద నువ్వు కనుక పోరాటం చేసి ఉంటే తెలుగు వారందరూ సంతోషించి ఉండేవారని అన్నారు.

హైదరాబాదులో ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి పదేళ్ల ఉమ్మడి రాజధానిని వదిలేసి చంద్రబాబుతో పాటు దొంగలాగా కరకట్టకి పారిపోకుండా ధైర్యంగా నువ్వు నిలబడి పోరాడి ఉంటే తెలుగు వారి పౌరుషం తెలుగు వారి సత్తా ఏంటో అందరూ అర్థం చేసుకొని అభినందించి ఉండేవారని అన్నారు. అలాగే ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే చాలని నీ బావ చంద్రబాబు నాయుడు, నీ అల్లుడు లోకేష్ ఏ విధంగా కడుపునిండా తిన్నారో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారో, అప్పుడు గనక మీరు రియాక్ట్ అయ్యి పోరాడి ఉంటే తెలుగు వాడి కోసం పోరాడి నిలబడ్డాడని అందరూ సంతోషించి ఉండేవారని అన్నారు. ఈ రోజు మీరు చేస్తున్న పోరాటం ఒక దొంగను కాపాడడానికి ఒక గజదొంగని కాపాడడానికి అని ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి నిన్న మీరు బంద్ కి పిలుపునిచ్చిన ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు బంద్ పాటించలేదని ఆమె అన్నారు.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top