2024 Elections: కలిసి పోటీ చేస్తామని ప్రకటించిన ఆప్.. కస్సుమన్న కాంగ్రెస్

72

AAP and Congress: రాబోయే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ విభాగం అధినేత ఇసుదాన్ గాధ్వి సోమవారం ఒక పెద్ద ప్రకటన చేశారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని పోటీ చేసి అధికార బీజేపీని ఓడిస్తామని ఆయన అన్నారు. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ భిన్నంగా స్పందించింది. వాస్తవానికి దీనిపై తమకు ఎలాంటి సమాచారం లేదని, ఆ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని గుజరాత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ దోషి అన్నారు. ప్రస్తుతం ఈ రెండు పార్టీలు కూటమిగా ఉన్నారు. అయినప్పటికీ ఇరు పార్టీల నేతలు పరస్పరం విరుద్ధ ప్రకటనలు చేయడం విడ్డూరం.

వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు 26 విపక్షాలు కలిసి ఇండియా అనే పేరుతో మహాకూటమిగా ఏర్పడ్డాయి. ఇందులో ఆప్ కూడా ఉంది. వాస్తవానికి ఇండియా కూటమి వద్ద ఒక ప్రతిపాదన ఉంది. ఎవరు బలంగా ఉన్న చోట వారు పోటీ చేయాలి. మిగతావారు వారికి మద్దతుగా ఉండాలి. ప్రచారం ఉమ్మడిగా చేయాలనేదే ఇప్పటి వరకు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఇంతకు మించి దేశవ్యాప్తంగా సీట్లు పంచుకొని పోటీ చేయాలనే ప్రతిపాదన అయితే లేదు. అయితే ఆప్‭కు కొద్ది రోజుల క్రితమే జాతీయ హోదా వచ్చింది. అలాగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 13 శాతం ఓట్లు సాధించింది. దీంతో ఆ పార్టీ గుజరాత్ అధ్యక్షుడు ఒక అడుగు ముందుకు వేసి సీట్ల ప్రకటన చేశారు.

సోమవారం గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గాధ్వి మాట్లాడుతూ కాంగ్రెస్, ఆప్ సీట్లు పంపకాలు చేసుకుని లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తాయని తెలిపారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్ రాష్ట్రంలో ఉన్న 26 స్థానాలను బీజేపీ గెలుచుకోదని అన్నారు. ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్, ఆప్ పార్టీల పొత్తు గుజరాత్‌కు కూడా వర్తిస్తుందని అన్నారు. రాబోయే గుజరాత్ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ పార్టీలు సీట్లు పంచుకుంటాయని ఆయన అన్నారు.

2014, 2019 ఎన్నికల్లో రెండు సార్లు రాష్ట్రంలోని మొత్తం స్థానాలను బీజేపీ గెలుచుకుంది. కొద్ది రోజుల క్రితం జరిగి గుజరాత్‌ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అనూహ్యంగా 5 సీట్లు గెలుచుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయం పాలైంది. వాస్తవానికి ఆప్ పోటీనే కాంగ్రెస్ కే పెద్ద అడ్డంకి అయింది. ఆప్ దాదాపు 13 శాతం ఓట్లు సాధించి 5 సీట్లతో మూడో స్థానంలో నిలిచింది. దీంతో కాంగ్రెస్ పార్టీ బాగా నష్టపోయి, కాంగ్రెస్ కేవలం 17 సీట్లకు పరిమితమైంది.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top