Abbas : విశాల్‌తో వివాదం గురించి బయటపెట్టిన అబ్బాస్.. నా గురించి అందరితో నెగిటివ్‌గా చెప్పేవాడంటూ..

45

Abbas : తమిళ హీరో అబ్బాస్ తన మొదటి సినిమా ప్రేమ దేశం(Prema Desham)తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వరుసగా తమిళ్, తెలుగు, మలయాళం సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేశాడు. 2015 నుంచి సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఫారిన్ వెళ్ళిపోయి జాబ్ చేసుకున్నాడు అబ్బాస్. ఇటీవలే చెన్నై(Chennai)కి రావడంతో పలు తమిళ యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ ఇంటర్వ్యూలలో గతంలో జరిగిన అనేక ఆసక్తికర విషయాలని పంచుకుంటున్నాడు.

గతంలో హీరో విశాల్(Vishal), అబ్బాస్ మధ్య ఓ వివాదం తలెత్తింది. అప్పట్నుంచి వీరిద్దరూ మాట్లాడుకోవట్లేదు కూడా. తాజాగా అబ్బాస్ విశాల్ తో జరిగిన వివాదం గురించి తెలిపాడు.

అబ్బాస్ మాట్లాడుతూ.. గతంలో సినిమా ఇండస్ట్రీ అంతా ఒకే ఫ్యామిలీ అని చెప్పడానికి సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ప్రారంభించారు. నేను కూడా వేరే హీరోలు, నటులు అందరితో కలిసి తమిళ పరిశ్రమ తరపున ఆడాను. ఆ లీగ్ సెకండ్ సీజన్ లో నాకు విశాల్ కి మధ్య కొన్ని మనస్పర్థలు వచ్చాయి. విశాల్ నన్ను అన్న మాటలకు బాధపడి ఆ లీగ్ నుంచి తప్పుకున్నాను. అతను నా గురించి వేరేవాళ్లకు అబద్ధాలు చెప్పాడు. నా మీద నెగిటివ్ గా చెప్పేవాడు. దీంతో విశాల్ తో ఉన్న బంధం నాకు తెగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ విశాల్ తో మాట్లాడలేదు. ఎప్పటికైనా అతను చేసిన తప్పుని రియలైజ్ అవుతాడని భావిస్తున్నాను. ఒకవేళ ఇప్పుడు ఎదురుపడినా హాయ్ అని పలకరిస్తాను అంతేకాని ఇదివరకులా క్లోజ్ గా అయితే మాట్లాడలేను అని తెలిపాడు. దీంతో విశాల్ పై అబ్బాస్ చేసిన వ్యాఖ్యలు తమిళ పరిశ్రమలో వైరల్ గా మారాయి. మరి దీనిపై విశాల్ ఏమన్నా స్పందిస్తాడేమో చూడాలి.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top