తెలంగాణ సీఎం పదవి ఆశించా.. కానీ.. భట్టి సంచలన వ్యాఖ్యలు..

164

తెలంగాణలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం తర్వాత సీఎంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని అధిష్టానం ఎంపిక చేసింది.

అయితే ఈ పదవిని కాంగ్రెస్ పార్టీలో పలువురు సీనియర్లు ఆశించారు. ఇందులో మధిర సీనియర్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్కతో పాటు హుజూర్ నగర్ ఎమ్మెల్యే, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. అయితే వీరిద్దరికీ కీలక హామీలు ఇచ్చి అధిష్టానం రేవంత్ సీఎం అయ్యేందుకు మార్గం సుగమం చేసింది.

ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి పదవి తనకు అందినట్లే అంది చేజారిపోవడంపై డిప్యూటీ సీఎం కాబోతున్న మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. తాను తెలంగాణ సీఎం పదవి ఆశించిన మాట వాస్తవమేనని భట్టి విక్రమార్క తెలిపారు. అయితే సీఎం పదవి రాకపోయినా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే ప్రభుత్వంలో అందరికీ పదవులు దక్కడం అసాధ్యమని భట్టి పేర్కొన్నారు. అయినా కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని భట్టి విక్రమార్క్ వెల్లడించారు.

Also Read: ఓటమి తర్వాత KCR ఫామ్‌హౌస్‌లో ఏం చేస్తున్నారో తెలుసా

తెలంగాణ సీఎం ఎంపిక కోసం నిర్వహించిన సీఎల్పీ భేటీ తర్వాత ఆ పదవికి పోటీ పడిన సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిని అధిష్టానం ఢిల్లీకి పిలిపించి బుజ్జగించింది. రేవంత్ రెడ్డిని సీఎంగా సమర్ధించాలని, భవిష్యత్తులో వీరిద్దరి బాధ్యత తమదేనని చెప్పినట్లు తెలిసింది. దీంతో భట్టితో పాటు ఉత్తమ్ కూడా శాంతించారు. అనంతరం వీరిద్దరి ముందే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సీఎంగా రేవంత్ రెడ్డిని ప్రకటించారు. అప్పటి నుంచి మౌనంగానే ఉంటున్న భట్టికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన అధిష్టానం.. ఉత్తమ్ కు కీలక మంత్రి పదవి ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top