రాశి ఫలాలు, పంచాంగం - ఆగస్టు 19, శనివారం 2023

146

ఈ రోజు పంచాంగం : సూర్యోదయం: ఉదయం 6.03 సూర్యాస్తమయం: సాయంత్రం.6.36 రాహుకాలం: ఉ.9.00 ల10.30 అమృత ఘడియలు: ఉ.10.30 ల11.30 మ3.10 సా6.10 దుర్ముహూర్తం: ఉ.7.41 ల8.32 

మేషం:

 ఈరోజు మీరు ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు. దీనివల్ల సంతోషంగా ఉంటారు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయడం మంచిది. మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

 వృషభం: 

ఈరోజు మీరు ఆర్థిక పరంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఎక్కువ ఖర్చులు చేయకూడదు. ఈరోజు కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి. లేదంటే సమస్యలను ఎదుర్కొంటారు.

మిథునం: 

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా ఆలోచించాలి. ఆర్థికంగా లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి దూరప్రయాణాలు చేస్తారు. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు. మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి. 

కర్కాటకం:

 ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి భవిష్యత్తు ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకూడదు. కొన్ని ముఖ్యమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు. పిల్లల భవిష్యత్తు గురించి తొందర పడకూడదు. ఈరోజు సమయాన్ని కాపాడుకోవాలి. 

సింహం: 

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు. అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకూడదు. ఈరోజు కొన్ని ప్రయాణాలు చేస్తారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. సమయాన్ని కాలక్షేపం చేస్తారు. చాలా ఉత్సాహంగా ఉంటారు. 

కన్య: 

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం తీసుకుంటారు. అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. 

తుల: 

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి. ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు. ఇంట్లో ఒకరి ఆరోగ్య సమస్య మరింత బాధ పెడుతుంది. కొన్ని ముఖ్యమైన ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. ఈరోజు మీకు కాస్త ఒత్తిడిగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. 

వృశ్చికం: 

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు. వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు. పనిచేసే చోట అధికారుల ప్రశంసలు అందుకుంటారు. చాలా సంతోషంగా ఉంటారు. 

ధనుస్సు: 

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది. కుటుంబ సభ్యులతో కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు. అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకండి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి. అనుకోకుండా మీ ఇంటికి ఈరోజు బంధువులు వస్తారు. 

మకరం:

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఉన్నాయి. అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి. శత్రువులకు దూరంగా ఉండాలి. మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

 కుంభం: 

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.తీరికలేని సమయంతో గడుపుతారు. అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేస్తారు. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి. అనుకోకుండా మీ స్నేహితులు కలుస్తారు. ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చవుతుంది. 

మీనం: 

ఈరోజు మీరు వాయిదా పడిన పనులన్నీ పూర్తి చేస్తారు. దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది. కొన్ని ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి. ముఖ్యమైన విషయాల గురించి అసలు పట్టించుకోరు. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top