Babar Azam : టీ20ల్లో బాబ‌ర్ ఆజామ్ అరుదైన రికార్డు.. అత్య‌ధిక శ‌త‌కాలు బాదిన ఆట‌గాళ్ల జాబితాలో రెండ‌వ స్థానం

115

Babar Azam century : పాకిస్తాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజామ్‌ (Babar Azam) అరుదైన ఘ‌న‌త‌ను అందుకున్నాడు. టీ20 క్రికెట్‌లో 10 సెంచ‌రీలు చేసిన రెండవ బ్యాట‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు. నేడు(సోమ‌వారం ఆగ‌స్టు 7న‌) లంక ప్రీమియ‌ర్ లీగ్‌(Lanka Premier League)లో అత‌డు ఈ రికార్డు సాధించాడు. కొలంబో స్ట్రైక‌ర్స్‌కు త‌రుపున ఆడుతున్న బాబ‌ర్ గాలె టైటాన్స్ పై కేవ‌లం 59 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స‌ర్ల సాయంతో 104 ప‌రుగులు చేశాడు. ఇది బాబ‌ర్ టీ20 కెరీర్‌లో(అంత‌ర్జాతీయ మ్యాచ్‌ల‌తో పాటు అన్ని లీగ్‌లు క‌లుపుకుని) 10వ శ‌త‌కం.

టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక శ‌త‌కాలు బాదిన రికార్డు వెస్టిండీస్ దిగ్గ‌జ ఆట‌గాడు క్రిస్ గేల్ (Chris Gayle) పేరిట ఉంది. ఈ విండీస్ వీరుడు ఏకంగా 22 సెంచ‌రీలు చేసి ఎవ్వ‌రికి అంద‌నంత ఎత్తులో ఉన్నాడు. గేల్ 2005 నుంచి 2022 వ‌ర‌కు మొత్తం 463 టీ20 మ్యాచులు ఆడి 14,562 ప‌రుగులు చేశాడు. ఇందులో 22 శ‌త‌కాలు, 88 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి.

బాబ‌ర్ ఆజామ్‌ నేటి మ్యాచ్‌తో క‌లిసి 264 టీ20 మ్యాచ్‌లు ఆడి 9,412 ప‌రుగులు చేశాడు. ఇందులో 10 శ‌త‌కాలు, 77 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. గేల్‌, బాబ‌ర్ త‌రువాతి స్థానాల్లో మైఖేల్ క్లింగ‌ర్‌ (8 శ‌త‌కాలు), డేవిడ్ వార్న‌ర్‌(8), విరాట్ కోహ్లి(8), అరోన్ ఫించ్‌(8) లు ఉన్నారు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన గాలే టైటాన్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్ల న‌ష్టానికి 188 ప‌రుగులు చేసింది. బాబ‌ర్ ఆజామ్ శ‌త‌కంతో చెల‌రేగ‌డంతో 189 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కొలంబో స్ట్రైక‌ర్స్ 19.5 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top