Bengaluru : ఒకే సమయంలో వేర్వేరు యాప్‌లలో రైడ్స్ యాక్సెప్ట్ చేస్తున్న బెంగళూరు ఆటో డ్రైవర్లు.. అలా ఎలా?

107

Bengaluru : అర్జంట్‌గా బయటకు వెళ్లాలి.. రెగ్యులర్‌గా వాడే యాప్‌లో రైడ్ బుక్ అవ్వకపోవచ్చు. ఆలస్యం చేయకుండా వేరే యాప్‌కి వెళ్లి ఆటో లేదా క్యాబ్ బుక్ చేసుకుంటాము. ఈ టెక్నిక్ మనం మాత్రమే ఉపయోగిస్తున్నామని అనుకుంటున్నారా?  బెంగళూరు ఆటో డ్రైవర్లు ఫాలో అయిపోతున్నారు. ఎలా అంటారా?

ఆఫీసు వేళల్లో ఉబెర్ లేదా ఆటో బుక్ చేసుకోవాలంటే పోరాటం చెయ్యాలి. ఇందుకు ఏ సిటీ కూడా మినహాయింపు కాదు. ఎందుకంటే మనకు కావాల్సిన విధంగా ఆటో లేదా క్యాబ్ బుక్ చేసుకోవడం అసాధ్యం. ఇక ఆటో డ్రైవర్లది ఇదే పరిస్థితి. బెంగళూరులో ఆటో డ్రైవర్ కూడా తమకు అనుగుణంగా ఒకే సమయంలో పలు యాప్‌లలో రైడ్‌లను యాక్సెప్ట్ చేస్తున్నారు.  విచిత్రంగా అనిపిస్తోందా? @design_melon_ అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన ట్వీట్ ఇంటర్నెట్‌లో ఆసక్తి రేకెత్తించింది. బెంగళూరులోని ఓ ఆటో డ్రైవర్ వేర్వేరు యాప్ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి రైడ్ అంగీకరించడం ద్వారా టైమ్ ట్రావెల్ అనుభూతిని కలిగిస్తున్నాడని ట్విట్‌లో పోస్ట్ చేశాడు. ‘రెండు వేర్వేరు లొకేష్స్, రెండు వేర్వేరు యాప్స్, రెండు వేర్వేరు ఫోన్లు.. అయితే ఒకటే ఆటో.. ఒకరే ఆటో డ్రైవర్’ అంటూ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

రద్దీగా ఉండే బెంగళూరు సిటీలో ఆటో డ్రైవర్లు తమ సేవల్ని మెరుగుపరుచుకోవడానికి కొత్త టెక్నాలజీని ఆహ్వానిస్తున్నారు. ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ (ARDU) ఈ డిజిటల్ విప్లవంలో ముందుంది. ఇప్పటికే ‘నమ్మ యాత్రి’, ‘మెట్రో మిత్ర’ వంటి కొత్త యాప్‌లను విడుదల చేసింది.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top