కోటీశ్వరుడు కావాలనుకుంటున్నారా..? అయితే ఈ సూత్రం తెలుసుకోండి

147

ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ధనవంతులు కావాలనే కోరిక ఉంటుంది. దీని కోసం ప్రజలు చాలా కష్టపడుతున్నారు. అయితే సంపాదించినంత సులువు కాదు దానిని సరైన మార్గంలో రెట్టింపు చేసుకోవటం. సరైన ఆర్థిక అవగాహన లేకపోవటం లేదా సరైన ఆర్థిక సూత్రాలు తెలియకపోవటం వల్ల తమ డబ్బును వృద్ధి చేసుకోలేకపోతున్నారు.

కోటీశ్వరుడు కావాలంటే చాలా డబ్బు పెట్టుబడిగా పెట్టాలని ప్రజలు అనుకుంటారు. ఇది నిజం కానప్పటికీ. ప్రతినెలా జీతంలో కొంత డబ్బు ఆదా చేస్తూ ఎవరైనా ధనవంతులు కావచ్చు. డబ్బు ఆదాకు చాలా మార్గాలు ఉన్నప్పటికీ.. ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. సరైన పెట్టుబడి మార్గాల్లో ఇన్వెస్ట్ చేయటం వల్ల మీరు త్వరగా ధనవంతులు కావచ్చు. అందుకోసం ముందుగా 15*30*20 సూత్రం గురించి తెలుసుకోండి.

Also Read: జైలర్ సినిమా విలన్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

డబ్బును నిర్వహించడం సంపాదించినంత సులభం కాదు. కొన్నిసార్లు ఎక్కడ ప్రారంభించాలో అర్థం చేసుకోవడం కష్టం. అటువంటి పరిస్థితిలో 50*30*20 నియమం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. డబ్బును ఆదా చేసుకోవడానికి ఇదొక గొప్ప మార్గం. ఈ నియమం కింద ఆదాయాన్ని మూడు భాగాలుగా విభజించుకోవాలి. ఈ నియమం ప్రకారం ఆదాయంలో 50 శాతాన్ని అద్దె, కిరాణా, రవాణా వంటి అవసరాలకు ఖర్చు చేయాలి. ఇదే సమయంలో బయట ఆహారం తినడం, వినోదం, షాపింగ్ వంటి అవసరాల కోసం 30 శాతం ఉంచాలి. ఆదాయంలో మిగిలిన 20% భవిష్యత్తు ఆర్థిక లక్ష్యాల కోసం పెట్టుబడి పెట్టేందుకు వినియోగించాలి.

50*30*20 నియమం మిమ్మల్ని ఆర్థికంగా బలపరుస్తుంది. ఇది మీ పొదుపును పెంచుతుంది. ఆదాయంలో మిగిలిన 20 శాతాన్ని SIPలో పెట్టుబడి పెట్టవచ్చు. SIP అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. ఇందులో జేబుపై ఎలాంటి భారం ఉండదు, దీర్ఘకాలంలో రాబడులు కూడా చాలా బాగుంటాయి. 15 సంవత్సరాల పాటు ఏడాదికి 15% చొప్పున ప్రతి నెలా రూ.15,000 పెట్టుబడి పెడితే.. దాదాపు రూ.27 లక్షలు అవుతుంది. దీనిపై వడ్డీ ఆదాయం రూ.73 లక్షల వరకు వస్తుంది. అసలు పెట్టుబడి దానిపై రాబడిని కలుపుకుంటే మెుత్తం రూ. కోటి కంటే ఎక్కువ ఆదాయం లభిస్తుంది. అలాగే ఎవరైనా ఈ పెట్టుబడిని 30 ఏళ్ల పాటు కొనసాగిస్తే వారి సంపద రూ.10 కోట్లను మించుతుంది.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top