Railway Recruitment 2023: సెంట్రల్ రైల్వేలో లోకో పైలట్, జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్...

219

వివిధ ప్రభుత్వ సంస్థలు, విభాగాలలో కెరీర్ పురోగతికి డిపార్ట్‌మెంటల్ ఎగ్జామ్స్‌ కీలకం. ఈ ప్రత్యేక పరీక్షలు ఉద్యోగులకు వారి స్కిల్స్‌, నాలెడ్జ్‌, డెడికేషన్‌ ప్రదర్శించే అవకాశాన్ని అందిస్తాయి. పని చేస్తున్న ఆఫీస్‌లో ర్యాంక్‌లను పెంచుకొనే అవకాశం ఇస్తాయి. ఇప్పుడు ఈ అవకాశం సెంట్రల్ రైల్వే ఉద్యోగులకు లభించింది. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ తాజాగా వివిధ పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ rrccr.com ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ ఆగస్టు 3 నుంచి ప్రారంభం కాగా, సెప్టెంబర్ 3న ముగుస్తుంది. ప్రధానంగా జూనియర్ ఇంజనీర్, లోకో పైలట్, గార్డ్/ట్రైన్ మేనేజర్ వంటి పోస్ట్‌ల్లో మొత్తంగా 1303 ఖాళీలను భర్తీ చేస్తారు.

ఖాళీల వివరాలు

అసిస్టెంట్ లోకో పైలట్- 732 పోస్టులు భర్తీ కానున్నాయి. టెక్నీషియన్-255, జూనియర్ ఇంజనీర్-234, గార్డ్/ట్రైన్ మేనేజర్ - 82 పోస్టులు భర్తీ చేస్తారు.

అర్హత ప్రమాణాలు

ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ జనరల్ డిపార్ట్‌మెంటల్ కాంపిటిటీవ్ ఎగ్జామినేషన్ (GDCE) కోటా కింద చేపడుతున్నారు. 2023 ఆగస్టు 1 నాటికి రెగ్యులర్, అర్హత ఉన్న సెంట్రల్ రైల్వే ఉద్యోగులు మాత్రమే ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు తప్పనిసరిగా 2021 ఆగస్టు 1 లేదా అంతకు ముందు రైల్వేలో పని చేస్తూ ఉండాలి. పదవీ విరమణ, లేదా మరొక రైల్వే జోన్‌కు బదిలీ అయిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు.

ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్

- అసిస్టెంట్ లోక్ పైలట్

పదో తరగతి తరువాత గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి NCVT/SCVT ట్రేడ్స్‌లో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా వివిధ ఇంజనీరింగ్ సబ్జెక్టుల్లో మూడేళ్ల డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

- టెక్నీషియన్

పదో తరగతితో పాటు NCVT/SCVT ట్రేడ్స్‌లో ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి.

- జూనియర్ ఇంజనీర్

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బేసిక్ స్ట్రీమ్, సబ్‌స్ట్రీమ్ నుంచి మూడేళ్ల డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.

- గార్డ్/ట్రైన్ మేనేజర్

గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి ఏదైనా ఫీల్డ్‌లో డిగ్రీ పాసై ఉండాలి.

వయోపరిమితి

దరఖాస్తుదారుల వయసు కేటగిరీ వారీగా.. జనరల్ అభ్యర్థులు 42 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 45, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 47 ఏళ్లు మించకూడదు.

అప్లికేషన్ ప్రాసెస్

ముందుగా RRC/CR’s అధికారిక పోర్టల్ www.rrccr.com ను విజిట్ చేయాలి. హోమ్ పేజీలోకి వెళ్లి, న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, 11 డిజిట్ ఎంప్లాయి ఐడీ నంబర్ వంటి పర్సనల్ వివరాలను ఎంటర్ చేయాలి. రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ వివరాలు మీ మెయిల్‌కు వస్తుంది. వాటి సాయంతో లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్ ఫిలప్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. చివరగా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top