చంద్రబాబుకు 6 నెలలు జైలు..!

69

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు ఏమాత్రం రిలీఫ్ ఇవ్వడం లేదు ఏపీ సీఐడీ. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ.పక్కా సాక్ష్యాధారాలతో చంద్రబాబే కుట్రదారని నిరూపిస్తూ చార్జీషిట్ దాఖలు చేసింది.

ఇక చంద్రబాబు జైలులో ఉండగానే ఆయనపై మరిన్ని పీటీ వారెంట్‌లు ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది సీఐడీ. దాదాపు 8 పీటీ వారెంట్‌లు దాఖలు చేయగా ఒకదాని తర్వాత మరొకటి ఇలా అరెస్ట్ చేసుకుంటూ వెళ్తే 6 నెలలైనా కేసుల పరంపర ఆగేలా కనిపించడం లేదని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు.ఒక వేళ సుప్రీం కోర్టులో స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో బెయిల్ వచ్చినా మరోక కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉందని వాదనలు వినిపిస్తున్నాయి..

Also Read: RK Roja: బాలకృష్ణ ఓ మెంటల్ గాడు... మంత్రి రోజా

ఎందుకంటే ఇప్పటికే రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పు పేరుతో అవినీతి. ఫైబర్ నెట్ వర్క్ స్కాం ,అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె ఆంగళ్లులో వైసీపీ నేతలపై దాడులకు సంబంధించి చంద్రబాబుపై హత్యాయత్నం,నేరపూరిత కుట్రతో పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. ఇలా ఒక కేసులో బెయిల్ వచ్చిన మరో కేసులో బాబు అరెస్ట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.ఇక దీంతో మరో 6 నెలలైనా చంద్రబాబు జైలులోనే ఉండాల్సి వచ్చిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.

చంద్రబాబు ఒకవేళ 6 నెలల పాటు జైలులో ఉంటే టీడీపీకి పెద్ద డ్యామేజ్ జరగడం పక్క. అంతలోపే ముందస్తు ఎన్నికలు వస్తే జగన్ సర్కార్ గతంలో వచ్చిన సీట్ల కంటే ఎక్కువ సీట్లు గెలిచినా ఆశ్చర్యపోనవసరం లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top