ఎన్టీఆర్‌ పెళ్లి రోజు X చంద్రబాబు పెళ్లి రోజు

123

పెళ్లి రోజు చుట్టూ తిరుగుతున్న రాజకీయం

పెళ్లి రోజున జైలుకు పంపారన్న బాబు వర్గం

సెప్టెంబర్‌ 10న ఎన్టీఆర్‌, లక్ష్మీపార్వతి పెళ్లిరోజు

సెప్టెంబర్‌ 10న జైల్లో గడిపిన చంద్రబాబు

అల్లుడి వెన్నుపోటుకు ఎన్టీఆర్‌ బదులిచ్చినట్టా?

సోషల్‌ మీడియాలో ఇది ఎన్టీఆర్‌ స్క్రిప్ట్‌ అంటోన్న అభిమానులు

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబును ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. నంద్యాలలో సెప్టెంబర్‌ 9న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత సెప్టెంబర్‌ 10న ఆయనకు 14 రోజుల రిమాండ్‌ను విధిస్తున్నట్లు కోర్టు తీర్పు వెల్లడించింది. అక్కడి నుంచి ఆయన్ను రాజమండ్రి జైలుకు పంపించారు. అక్కడ బాబుకు ఖైదీ నంబర్‌ 7691 కేటాయించారు. సెప్టెంబర్‌ 10కి ఇంకో ప్రత్యేకత ఉంది. అది ఎన్టీఆర్‌ పెళ్లిరోజు. అదే రోజున లక్ష్మీపార్వతిని తిరుపతిలో ఎన్టీఆర్‌ అభిమానుల ముందు వివాహం చేసుకున్నారు.

Also Read: చంద్రబాబు అరెస్ట్ - విజయవాడకు తరలింపు..!!

చంద్రబాబు అరెస్ట్‌తో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ గారిని తెలుగు ప్రజలు ఇప్పుడు బాగా గుర్తుచేసుకుంటున్నారు. ఆయన అల్లుడు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అవినీతి కేసులో అరెస్ట్ అయ్యి జైలు ఊచలు లెక్కిస్తున్న వేళ ఎన్టీఆర్‌కు అప్పట్లో చంద్రబాబు చేసిన అన్యాయాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఆయన ఎంతగానో నమ్మిన చంద్రబాబే ఆయన పదవితో పాటు పార్టీని అక్రమంగా లాక్కోవడం.. రాజకీయంగా ఆయన్ని పతనం చేయడం.. ఆయనపైనే చెప్పులు వేయించి, మానసిక క్షోభకు గురిచేసి తీవ్ర అవమానాలకు గురిచేయడం. అదే ఆవేదనలో ఎన్టీఆర్ మరణించడం. ఈ విషయాలు జనం ఎప్పటికీ మరిచిపోలేనివే. తాజాగా బాబు అరెస్ట్‌తో అన్నగారి ఆత్మ శివతాండవం చేస్తుంటుందని ఆయన అభిమానులు మీడియా ద్వారా తెలుపుతున్నారు.

అన్నగారి పెళ్లిరోజే బాబు జైలుకు
అది 1993 సెప్టెంబర్ 10 తిరుపతిలో మేజర్‌ చంద్రకాంత్‌ సినిమా 100వ రోజుల వేడుక జరుగుతుండగా వేదికపైకి లక్ష్మీ పార్వతిని పిలిచారు. తన కుటుంబ సభ్యుల వల్ల ఆమె చాలా ఇబ్బంది పడుతుందని లక్షల అభిమానుల సాక్షిగా బహిరంగంగా చెప్పారు. ఆమెను వివాహం చేసుకుంటున్నట్లు ఆయన అక్కడే ప్రకటించారు. పెప్టెంబర్‌ 11న తిరుపతిలోనే లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకున్నారు.

అలా కొద్దిరోజులు గడిచిన తర్వాత చంద్రబాబు వెన్నుపోటుకు గురి కావడం... అలా ఆయన చివరి రోజులు కూడా ఆత్మ క్షోభను అనుభవిస్తూ మరణించారు. ఆ పాపమే నేడు చంద్రబాబును వెంటాడుతుందని ఎన్టీఆర్‌ అభిమానులు అంటున్నారు. అందుకే ఎన్టీఆర్‌ పెళ్లిరోజే చంద్రబాబు ఊచలు లెక్కపెడుతున్నాడని.. ఇదీ దేవుడు స్క్రిప్ట్‌ కాదు అన్నగారి స్క్రిప్ట్‌ అంటూ నేడు వారందరూ సంతోషిస్తున్నారు.

బాబుగారిని వెంటాడుతున్న అన్నగారి స్క్రిప్ట్‌
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కుని ఆపై అక్రమంగా ప్రజా సొమ్మును దోచుకోవడం.. ఇలా గతంలో చంద్రబాబు చేసిన లేక్కలేనన్ని పాపాలు వెంటాడుతున్నాయి. గతంలో అనేక విషయాల్లో ఆయన అనుసరించిన వైఖరి ప్రస్తుతం బాబుకు ఎదురుదెబ్బ తగిలేలా కాలం వెంటాడుతుంది. 74వ ఏట ఎన్టీఆర్‌కు ఘోరమైన అవమానం చేసిన చంద్రబాబు విచిత్రంగా అదే 74వ ఏటా తాను కూడా క్షోభ అనుభవించాల్సి వచ్చింది.

ఇది ఎన్టీఆర్‌ రాసిన స్క్రిప్టే.. కోర్టులతో పాటు ఎల్లో మీడియాను వాడుకుని రాష్ట్రాన్ని మోసం చేసిన చంద్రబాబు.. అదే కోర్టుల ద్వారా జైలుకు వెళ్లడం వంటివి చూస్తే నిజమేనని అనిపిస్తుంది. ఇది ఎన్టీఆర్ ఆత్మ శాంతించే రోజని అన్నగారి అభిమానులు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. పలువురు ఎన్టీఆర్ అభిమానులైతే ఆయన చిత్ర పటాలకు, విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేస్తున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు అరెస్టుతో మరోసారి ఎన్టీఆర్‌ను తెలుగు ప్రజలంతా గుర్తుచేసుకుంటున్నారు.

23 నంబర్‌తో పాటు 14 కూడా
14 ఏళ్ల ముఖ్యమంత్రిగా అనుభం, 14 ఏళ్ల ప్రతిపక్షనేతగా పనిచేసిన అనుభవం నాది అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబుకు సరిగ్గా 14 రోజుల రిమాండ్‌ను కోర్టు విధించింది. ఇది కదా కాల నిర్ణయం అంటే..? అని కొంతమంది నెట్టింట ట్రోల్‌ చేస్తున్నారు. 'చంద్రబాబు ఖైదీ నెంబర్ 7691. 7+6+9+1 = 23. ఆయన అరెస్ట్‌ అయిన ఏడాది కూడా 2023. అంటే 23 చంద్రబాబుకు లక్కీ నెంబర్‌ అని ఎద్దేవా చేస్తూ ట్వీట్స్‌ చేస్తున్నారు.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top