Sunrisers Hyderabad : సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్‌గా డేనియల్ వెటోరి.. లారా పై వేటు

80

Sunrisers Hyderabad head coach : గ‌త కొన్ని సీజ‌న్లుగా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (Sunrisers Hyderabad) ఆట‌తీరు ఏ మాత్రం బాగాలేదు. ఐపీఎల్ 2023 సీజ‌న్‌లోనూ నిరాశ‌జ‌న‌క ప్ర‌ద‌ర్శ‌న‌ను క‌న‌బ‌రిచింది. 14 మ్యాచుల్లో నాలుగంటే నాలుగు మ్యాచుల్లో గెలిచి పాయింట్ల ప‌ట్టిక‌లో అట్ట‌డుగు స్థానంలో నిలిచింది. ఈ క్ర‌మంలో ఎస్ఆర్‌హెచ్ యాజ‌మాన్యం చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. ముందు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ప్ర‌ధాన కోచ్‌గా ఉన్న లారా(Brian Lara) పై వేటు వేసింది. అత‌డి స్థానంలో న్యూజిలాండ్ దిగ్గ‌జ ఆట‌గాడు డేనియ‌ల్ వెటోరి(Daniel Vettori)ని నియ‌మించింది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో వేదిక‌గా ఎస్ఆర్‌హెచ్ తెలియ‌జేసింది. కోచ్‌కు స్వాగ‌తం చెబుతూ ఓ ఫోటోను పంచుకుంది.

వెటోరీ న్యూజిలాండ్ త‌రుపున 113 టెస్టు మ్యాచుల్లో 362 వికెట్లు తీయ‌డంతో పాటు 4,531 ప‌రుగులు చేశాడు. 295 వ‌న్డేల్లో 305 వికెట్లు ప‌డ‌గొట్ట‌డంతో పాటు 2,253 ప‌రుగులు, 34 టీ20ల్లో 38 వికెట్లు తీయ‌డంతో పాటు 205 ప‌రుగులు చేశాడు. 2015 ప్ర‌పంచ‌క‌ప్ త‌రువాత‌ అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాడు. అంత‌క సంవ‌త్స‌రం ముందు నుంచే కోచ్‌గా కెరీర్‌ను ప్రారంభించాడు. ఐపీఎల్‌లో 2014 నుంచి 2018 వ‌ర‌కు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టుకు హెడ్ కోచ్‌గా ప‌ని చేశాడు.

బంగ్లాదేశ్ జాతీయ జట్టుకు స్పిన్ బౌలింగ్ కోచ్ గా చేశాడు. ఆగస్టు 2021లో కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ బార్బడోస్ రాయల్స్‌కు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆస్ట్రేలియాకు సహాయకుడిగా, స్పిన్ బౌలింగ్ కోచ్‌గా ప‌ని చేశాడు. నాథన్ లియోన్‌కు స్పిన్ మెల‌కువ‌లు నేర్పించ‌డంతో పాటు టాడ్ మర్ఫీ వంటి రత్నాలను వెలికితీసాడు. భారత్‌తో జరిగిన తొలి టెస్టులోనే మర్ఫీ 7 వికెట్లు ప‌డ‌గొట్టిన సంగ‌తి తెలిసిందే.

మూడేళ్ల‌లో ముగ్గురు కెప్టెన్లు, ముగ్గురు కోచ్‌లు

ఎస్ఆర్‌హెచ్ 2021 సీజన్ నుండి పాయింట్ల ప‌ట్టిక‌లో దిగువ‌ స్థానాల్లోనే ఉంటూ వ‌స్తోంది. గత మూడు సీజన్లలో రెండింటిలో చివరి స్థానంలోనే నిలిచింది. గత మూడేళ్లలో డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, ఐడెన్ మార్క్రామ్ ముగ్గురు కెప్టెన్లను మార్చింది. తాజాగా వెటోరి నియామ‌కంతో 3 కోచ్‌ల‌ను కూడా మార్చిన‌ట్లైంది. బ్రియాన్ లారా కంటే ముందు టామ్ మూడీని తొలగించింది.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top