ధీమహి ఫస్ట్ లుక్.. పుర్రెల గుట్ట‌పై శివుడి త్రిశూలం..

37

Dhimahi first look poster : కెప్టెన్ కుక్ ఫిలిమ్స్ పతాకంపై 7:11PM చిత్రం ఫేమ్ సాహస్ పగడాల హీరోగా న‌టిస్తున్న‌ చిత్రం ‘ధీమహి’. విరాట్ కపూర్, సాహస్ పగడాల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి సాహస్ పగడాల, నవీన్ కంటె దర్శకులు. నిఖిత చోప్రా హీరోయిన్ కాగా.. షారోన్ రవి సంగీతం అందిస్తున్నారు. షూటింగ్, నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీతో విడుదలకు సిద్ధ‌మైంది. ఈ క్ర‌మంలో సినిమా యొక్క మొదటి పోస్టర్ ను విడుద‌ల చేసింది చిత్ర బృందం.

అనంతరం చిత్ర యూనిట్ మాట్లాడుతూ.. ధీమహి సినిమా చాలా కొత్తగా ఉంటుందని చెప్పింది. 7:11PM చిత్రంలో నటించిన సాహస్ పగడాల ఈ సినిమాలో నటిస్తూ, స్వీయ దర్శకత్వం వహించారని, థ్రిల్ల‌ర్ చిత్రంగా రూపుదిద్దుకుందన్నారు. షూటింగ్, నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. మా చిత్రం లోని పాటలను త్వరలో జీ మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుదల చేయ‌నున్న‌ట్లు చెప్పారు. ప్రస్తుతం సెన్సార్ పనుల్లో ఉన్నాము. సినిమా చాలా కొత్తగా ఉంటుంది, త్వరలోనే ట్రైలర్ తో మీ ముందుకు వస్తాం. రిలీజ్ డేట్‌ను కూడా ప్ర‌క‌టిస్తాం అని తెలిపారు.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top