NBFC: తెలంగాణ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఎలక్ట్రానికా ఫైనాన్స్ లిమిటెడ్

115

Electronica Finance Limited: పూణేకు చెందిన ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ(NBFC), MSMEలకు ఫైనాన్సింగ్ చేసే ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్-ఎనర్జీ ఎఫెక్టివ్ మెషిన్ ఫైనాన్సింగ్‌పై దృష్టి సారించిన ఎలక్ట్రానికా ఫైనాన్స్ లిమిటెడ్(EFL), వరంగల్, సూర్యాపేటలో ఏడు శాఖలను ప్రారంభించడం ద్వారా తెలంగాణ మార్కెట్‌లోకి ప్రవేశించింది. అత్యంత పారదర్శక పద్ధతిలో సౌకర్యవంతమైన రుణ సదుపాయాన్ని అందించడం ద్వారా తెలంగాణలోని చిన్న వ్యాపారాల ఆకాంక్షలను తీర్చడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.


ఇప్పటికే గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ మార్కెట్‌ల ఈ కంపెనీ పని చేస్తోంది. ఇక తెలంగాణలోనూ తన లోన్ ఎగైనెస్ట్ ప్రాపర్టీ రుణాలను అందించడానికి EFL ఎదురుచూస్తోంది. దీని ద్వారా, EFL యొక్క ఉత్పత్తి సమర్పణ తెలంగాణలోని MSMEలు, వ్యక్తులకు క్రెడిట్ లభ్యతను అందించనుంది. ఈ కంపెనీ తెలంగాణ సహా పలు ప్రాంతాలలో 50కి పైగా శాఖలను తెరవాలని యోచిస్తోంది. కంపెనీ భారతదేశం అంతటా 175 కంటే ఎక్కువ శాఖలను ఏర్పాటు చేసింది. వచ్చే ఐదేళ్లలో ఈ సంఖ్యను 500 శాఖలకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది, అలాగే తమ సిబ్బందిని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top