Cricket News: అఫ్గానిస్థాన్ ఫాస్ట్ బౌలర్ నవీనుల్ హక్‌పై ILT20 నిషేధం

113

అఫ్గానిస్థాన్ ఫాస్ట్ బౌలర్ నవీనుల్ హక్‌పై ILT20 నిషేధం విధించింది. యూఏఈ వేదికగా జరిగే ఈ లీగ్‌లో నవీనుల్ షార్జా వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ ఏడాది జనవరి-ఫిబ్రవరి మధ్య జరిగిన తొలి సీజన్‌లో షార్జా తరఫున ఆడాడు.

వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానున్న రెండో సీజన్‌ కోసం వారియర్స్‌ యాజమాన్యం నవీనుల్ కాంట్రాక్ట్‌ను పొడగించింది. కానీ, రిటెన్షన్‌ నోటీసుపై సంతకం చేయడానికి అతడు నిరాకరించాడు. ఫ్రాంఛైజీతో ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకుగాను ILT20 నవీనుల్‌ హక్‌పై 20 నెలల నిషేధం విధించింది.

2023లో జరిగిన ILT20 తొలి సీజన్‌లో నవీనుల్ మంచి ప్రదర్శన కనబర్చాడు. జునైద్‌ సిద్ధిఖ్‌తో కలిసి అత్యధిక వికెట్లు (11) పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top