iPhone 15 Series Launch : ఆపిల్ అభిమానులకు పండగే.. ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ డేట్ తెలిసిందోచ్.. ధర, ఫీచర్లు ఇవేనట..!

43

iPhone 15 Series Launch : ఆపిల్ అతిపెద్ద iPhone 15 లాంచ్ ఈవెంట్‌ను సెప్టెంబర్ 13న హోస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. 9To5Mac నివేదిక ప్రకారం.. మొబైల్ క్యారియర్లు తమ ఉద్యోగులకు సెప్టెంబర్ 13న ఎలాంటి ముందస్తు కమిట్‌మెంట్‌లు లేకుండా ఉండాలని సూచించినట్టు నివేదిక పేర్కొంది. ఎందుకంటే.. అదే రోజున ముఖ్యమైన స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే, సెప్టెంబరులో లాంచ్ ఈవెంట్‌లను హోస్ట్ చేసే ఆపిల్ సంప్రదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. సెప్టెంబర్ 13న ఆపిల్ మెగా ఈవెంట్ నిర్వహించే అవకాశం ఉంది. ఈ తేదీ నిజమైతే.. మీరు రాబోయే వారాలు లేదా రోజుల్లో ఆపిల్ నుంచి అధికారిక ప్రకటనను చూడవచ్చు. అప్పటివరకూ ఆగలేరంటే.. ఐఫోన్ లీకైన స్పెసిఫికేషన్‌లు, ధర గురించి ఓసారి లుక్కయండి.

ఐఫోన్ 15, Plus, Pro, Pro Max మోడల్స్ ఆపిల్ సెప్టెంబర్ లాంచ్ ఈవెంట్‌కు ముందు స్పెక్స్ లీక్ అయ్యాయి. అన్ని ఐఫోన్ 15 వేరియంట్‌లు డైనమిక్ ఐలాండ్ ఫీచర్‌తో వస్తాయని అంచనా. 2023 చివరిలో ఐఫోన్‌లలో పంచ్-హోల్ డిస్‌ప్లేను చూడవచ్చు. ప్రో, ప్రో మాక్స్ డిస్‌ప్లేలు కొత్త టెక్నాలజీతో రానున్నాయి. లో-ఇంజెక్షన్ ప్రెజర్ ఓవర్-మోల్డింగ్ లేదా ‘LIPO’ ఆపిల్ అందించనుంది. ఈ కొత్త ప్రక్రియ డిస్‌ప్లే చుట్టూ ఉన్న బోర్డర్ సైజును 1.5 మిల్లీమీటర్‌లకు కుదిస్తుంది. తద్వారా డివైజ్ బార్డర్లను సన్నగా చేస్తుంది. డిస్ప్లే సైజు కొంచెం పెరుగుతుంది. ఆపిల్ చివరికి ఐప్యాడ్‌కు కూడా ఇదే ఫీచర్‌ను తీసుకురావాలని యోచిస్తోంది.

2012 నుంచి iPhoneలు లైట్నింగ్ ఛార్జర్‌పై ఆధారపడి ఉన్నాయి. అయితే, రాబోయే iPhone 15, iPhone 15 Plus మోడల్స్ బ్లూమ్‌బెర్గ్ ప్రకారం.. USB-C ఛార్జింగ్‌ను పొందడానికి రెడీగా ఉన్నాయి ఈ మార్పుతో యూనివర్సల్ ఛార్జర్‌ని అందించనుంది. మీ డివైజ్ ఛార్జింగ్‌ను క్రమబద్ధీకరిస్తుంది. ముఖ్యంగా, ఐఫోన్ 15 ప్రో, ప్రో మాక్స్ వెర్షన్‌లు టైటానియం ఎడ్జ్‌లతో రానున్నాయి. ఐఫోన్ 15, 15 ప్లస్‌లు ప్రస్తుత మోడల్‌లకు సమానమైన రూపాన్ని కలిగి ఉన్నప్పటికీ, ముఖ్యమైన కెమెరా, ఐఫోన్ 14 ప్రో లైన్ నుంచి A16 చిప్ అందించే అవకాశం ఉంది. ప్రో మోడల్‌లు వేగవంతమైన 3-నానోమీటర్ చిప్‌కి మారవచ్చు. ఆపిల్ బయోనిక్ A17 SoC ప్రాసెసర్ ఉండవచ్చు.

ఐఫోన్ 14 ప్రో సిరీస్ మాదిరిగానే ప్రామాణిక ఐఫోన్ 15 వేరియంట్‌లు 48MP బ్యాక్ కెమెరాలతో రానుంది. గత ఐఫోన్ 12MP సెన్సార్‌లతో పోలిస్తే.. ఈ మెరుగుదల గణనీయంగా ఉంది. అదనంగా, ప్రో మాక్స్ పెద్ద కెమెరా మాడ్యూల్ హౌసింగ్ పెరిస్కోప్ లెన్స్‌లతో రానుందని భావిస్తున్నారు. ఆకట్టుకునే 5-6x ఆప్టికల్ జూమ్ సామర్థ్యాలను, ఇతర సెన్సార్‌లతో కలిసి ఉంటుంది. ఐఫోన్‌లలో ఫీచర్‌గా ఉన్న ఫిజికల్ మ్యూట్ స్విచ్ కొత్త, ప్రోగ్రామబుల్ ’యాక్షన్ బటన్’ ద్వారా భర్తీ చేయనుంది. లేటెస్ట్ iOS బీటా వెర్షన్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం.. కొత్త ఫీచర్ సైలెంట్ మోడ్ ఫంక్షనాలిటీ, ఫ్లాష్‌లైట్, ఫోకస్ మోడ్, ట్రాన్స్‌లేట్ యాప్, ఐఫోన్ కెమెరా యాప్‌లో మాగ్నిఫైయర్ మరిన్నింటిని నిర్వహించేందుకు అనుమతిస్తుంది.

కొన్ని లీక్‌ల ప్రకారం.. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ మోడల్‌లు పాత ధరలకే రానున్నాయి. ఇది నిజమని తేలితే.. ఈ డివైజ్‌ల ధర వరుసగా రూ. 79,900, రూ. 89,900 కావచ్చు. లీక్‌లను పరిశీలిస్తే.. iPhone 15 Pro, Pro Max మోడల్‌లు పాత ధరలకు అందుబాటులో ఉండవు. ఐఫోన్ 15 ప్రో ధర 1,099 డాలర్లు ఉండవచ్చు. గత ఏడాది మోడల్ ధర 999 డాలర్ల నుంచి పెరిగింది. ఆపిల్ భారత మార్కెట్లో ప్రతి డాలర్‌ను రూ. 100గా పరిగణిస్తోంది.. తద్వారా ఐఫోన్ ప్రో మోడల్‌ను రూ. 1,39,900కి లాంచ్ చేసే అవకాశం ఉంది.

అదేవిధంగా, iPhone 15 Pro Max గత ఏడాది మోడల్ ధర 1,099 డాలర్ల నుంచి 1,299 డాలర్ల వద్ద ఆవిష్కరించనుంది. ఆపిల్ కొత్త ప్రో మాక్స్ మోడల్‌ను రూ. 1,59,900 వద్ద ప్రకటించవచ్చు. అయితే, ఈ ధరలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ధరల గురించి తెలియాలంటే వినియోగదారులు మరికొన్ని వారాలు వేచి ఉండాలి. ఆపిల్ లేటెస్ట్ ఈవెంట్‌ను ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభించే అవకాశం ఉంది. ఆపిల్ ఈవెంట్‌కు సంబంధించిన అధికారిక తేదీలు ఇంకా వెల్లడి కాలేదు.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top