40 వేల రూపాయల లోపే ఐ ఫోన్ 15 సొంతం చేసుకోవచ్చు..

141

యాపిల్ ఐ ఫోన్ 15 సిరీస్ ఫోన్ల సేల్ ప్రారంభమైంది. భారత్ లో కూడా ఐ ఫోన్ 15 సిరీస్ ఫోన్ల కోసం భారీ డిమాండ్ ఉంది. ఈ సిరీస్ ఫోన్లను సెప్టెంబర్ 12న జరిగిన యాపిల్ ఈవెంట్ లో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి ఈ ఫోన్ల ప్రి బుకింగ్ కూడా ప్రారంభమైంది.

ఐ ఫోన్ 15 సిరీస్ ఫోన్లు నేటి నుంచి అన్ని యాపిల్ స్టోర్స్, వెబ్ సైట్స్, ఇతర ఈ కామర్స్ సైట్స్ లో అందుబాటులో ఉన్నాయి. ఐ ఫోన్ 15 సిరీస్ లో మొత్తం నాలుగు మోడల్స్ ఉన్నాయి. అవి ఐ ఫోన్ 15, ఐ ఫోన్ 15 ప్లస్, ఐ ఫోన్ 15 ప్రొ, ఐ ఫోన్ 15 ప్రొ మాక్స్. వీటిలో ఐ ఫోన్ 15 ధర తక్కువ, ఐ ఫోన్ 15 ప్రొ మాక్స్ ధర ఎక్కువ. ఐఫోన్ 15 128 జీబీ వేరియంట్ ధర భారత్ లో రూ. 79,900 లకు లభిస్తుంది. 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 89,900 లకు, 512 జీబీ వేరియంట్ రూ. 1,09,900 లకు లభిస్తుంది.

Also Read: నెలకు రూ.200 కడితే.. సంవత్సరానికి రూ.72 వేలు వస్తాయి..!

అయితే, మీరు ఇప్పటికే యాపిల్ కస్టమర్ అయితే, మీ స్మార్ట్‌ఫోన్‌ను ఐఫోన్ 15 కు అప్‌గ్రేడ్ చేయడానికి ఆసక్తి కలిగి ఉన్నట్లయితే, దాన్ని మీరు రూ. 40,000 లోపు ధరకే పొందవచ్చు. ఎలా అంటే..

  • ఐఫోన్ 15 128 జీబీ వేరియంట్ ధర భారత్ లో రూ. 79,900 లకు లభిస్తుంది.
  • దీనిపై ఇండియా ఐ స్టోర్ రూ. 5 వేల తక్షణ క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. అంటే ధర రూ. 74,900కి తగ్గుతుంది.
  • మీ వద్ద iPhone 13 లేదా iPhone 14 ఉన్నట్లయితే, మీరు గరిష్టంగా రూ. 37,000 వరకు ఎక్స్ఛేంజ్ విలువను పొందవచ్చు.
  • అంటే మీ వద్ద ఉన్న iPhone 13 లేదా iPhone 14 కు గరిష్ట ఎక్స్చేంజ్ విలువ వచ్చినట్లయితే, దాదాపు రూ. 38 వేలకే మీరు సరికొత్త ఐ ఫోన్ 15 స్మార్ట్ ఫోన్ ను పొందవచ్చు.
  • అయితే, రూ. 37 వేలు అనేది గరిష్ట ఎక్స్చేంజ్ వాల్యూ అన్న విషయం గుర్తుంచుకోవాలి.
  • మీ వద్ద ఉన్న iPhone 13 లేదా iPhone 14 ఎలాంటి డ్యామేజీ లేకుండా, వర్కింగ్ కండిషన్ లో ఉండాలి.
  • క్రోమా వంటి రిటైల్ స్టోర్‌ లో రూ. 2 వేల నామమాత్రపు డిపాజిట్ తో ఐ ఫోన్ 15 ఫోన్లను ప్రి బుక్ చేసుకోవచ్చు.
  • అదనంగా హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో రూ. 6 వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top