Mansoor Ali Khan: నాది వక్రబుద్ది అయితే.. చిరంజీవిది ఏంటి మరి.. ?

97

కోలీవుడ్ నటుడు మన్సూర్ ఆలీఖాన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారాడు. ఏ ముహూర్తాన.. హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశాడో..

అప్పటినుంచి మన్సూర్ పేరు మారుమ్రోగిపోతుంది. లియో సినిమాలో త్రిషతో సన్నివేశాలు ఉన్నాయా.. ? అన్న ప్రశ్నకు మన్సూర్ .. త్రిషతో తనకు ఎలాంటి సీన్స్ లేవు. నేను ఆమెను రేప్ చేసే సీన్స్ ఏమైనా పెడతారేమో అనుకున్నాను అని వివాదాన్ని మొదలుపెట్టాడు. ఒక నటిని.. ఇలా అనడం సరికాదని త్రిషతో పాటు ఇండస్ట్రీ అంతా మన్సూర్ ను ఏకిపారేసింది. అతనిది వక్రబుద్ధి అని, అతనిని బ్యాన్ చేయడమే కాకుండా.. అతడిపై కేసు కూడా పెట్టారు. ఇక కోర్టులో ఈ కేసు నడుస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే.. టాలీవుడ్ నుంచి హీరోయిన్స్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా త్రిషకు సపోర్ట్ గా నిలిచాడు. మన్సూర్ ఆలీఖాన్ అలా మాట్లాడడం తప్పు అని.. అతనిది వక్రబుద్ధి అంటూ ట్వీట్ చేశాడు. ఇక తాజాగా మనూస్ర్ ఆలీఖాన్ .. చిరు వ్యాఖ్యలపై స్పందించాడు. తనపై ట్వీట్ చేసిన త్రిష, చిరంజీవి, ఖుష్బూ లపై పరువునష్టం దావా వేస్తాను అని చెప్పుకురావడం హాట్ టాపిక్ గా మారింది.

Also Read: నదిలో రొమాన్స్..! చితకబాదిన ప్రజలు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మన్సూర్ మాట్లాడుతూ.. ” చిరంజీవి నన్ను తప్పు పడుతూ ట్వీట్ వేశారు. ఆయన పెద్ద నటుడు, పొలిటికల్ పార్టీ కూడా నడిపినవారు. నేను ఆయనతో కలిసి పనిచేసాను. అలాంటి వ్యక్తి.. ట్వీట్ వేసేముందు.. ఒక్కసారి నాకు కాల్ చేసి అడగాల్సింది. మన్సూర్ గారు.. అసలు జరిగింది ఏంటి.. ? ఇలా ట్వీట్ వేస్తున్నా.. ? నిజానిజాలు తెలుసుకొని వేయాల్సింది. నాది వక్రబుద్ధి అని ఆయన చెప్తున్నారు.. మరి ఆయనది ఏంటి.. ? రాజకీయాల పేరుతో ఎంతోమంది పార్టీల దగ్గర డబ్బు తీసుకొని ప్రజలకు ఏం చేయకుండా ఆయనే వాడుకున్నారు. అవన్నీ నేను అడగాలా.. ? అందుకే నేను వారి మీద పరువు నష్టం కేసు వేస్తున్నా.. త్రిష పది కోట్లు.. ఖుష్బూ పదికోట్లు.. చిరంజీవి.. 20 కోట్లు ఇవ్వాలి. వారు ఇచ్చిన డబ్బును.. నేను తమిళనాడులో మద్యం తాగి చనిపోయిన కుటుంబాలకు ఇస్తాను. ఇది దేవుడి మీద ఒట్టు. చిరంజీవి తప్పు చేసాడు. నన్ను అడగకుండా.. నిజానిజాలు తెలుసుకోకుండా ట్వీట్ ఎలా చేస్తాడు..?” అని ప్రశ్నించాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top