వరుణ్ తేజ్ తోపాటు నిహారికకు రెండో పెళ్లి..?

79

మెగా కుటుంబంలో త్వరలోనే పెళ్లి సందడిని చూడనున్నాం. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కి ఎంగేజ్ మెంట్ జరిగింది. నవంబరులో వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను చూస్తున్నారు. అయితే వీరిద్దరి వివాహంతోపాటు నిహారికకు సంబంధించిన వార్త ఒకటి బయటకు వచ్చింది.

వరుణ్ తేజ్ పెళ్లిలోనే నిహారిక కూడా రెండో పెళ్లి చేయాలని నాగబాబు ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. పెళ్లికి వరుడు కూడా సిద్ధంగానే ఉన్నాడు. వాళ్ల కుటుంబానికే చెందిన ఫ్యామిలీ ఫ్రెండ్ కొడుకు ఉన్నాడంట. బిజినెస్ మ్యాన్ అని తెలుస్తోంది. వారి అబ్బాయికిచ్చి చేయాలని మాట్లాడుకుంటున్నారు. నిహారిక ఏమంటుందనే విషయం తెలియదుకానీ అసలు ఈ వార్తలో నిజం ఉందా? లేదా? అనేదే తెలియడంలేదు. ఎంతవరకు నమ్మాలో అర్థం కావడంలేదని మెగా అభిమానులు అంటున్నారు. సోషల్ మీడియాలో మాత్రం వార్త వైరల్ గా మారింది.

Also Read:- కొడుకు వయసున్న హీరోతో సహజీవనం చేస్తున్న సురేఖ వాణి..!

వాస్తవానికి వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం ఆగస్టులోనే ఉంటుందనుకున్నారు. అయితే నిహారిక విడాకులు తీసుకున్న సమయంలో వెంటనే ఈ పెళ్లి పెట్టుకోవడం సరికాదని నాగబాబు భావించారు. నవంబరులో వరుణ్ కు వివాహం చేయాలి కాబట్టి.. అదే సమయానికి నిహారికకు కూడా పెళ్లి చేయాలనే నిర్ణయాన్ని నాగబాబు తీసుకున్నట్లు తెలుస్తోంది.

మెగా బ్రదర్ నాగబాబుకి తన ఇద్దరు పిల్లలంటే ఎంతో ప్రాణం. ప్రస్తుతం యావరేజ్ హీరోగా ఉన్న వరుణ్ భవిష్యత్తులో స్టార్ హీరో అవడానికి ప్రయత్నిస్తున్నాడు. అలాగే ఒక హీరోయిన్ ను కూడా ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆడపిల్ల పెళ్లి ముందే చేయాలని భావించి నిహారికకు వివాహం చేస్తే పరిస్థితి ఎదురు తిరిగింది. కొద్దికాలంలోనే కూతురు, అల్లుడు విడాకులు తీసుకున్నారు. ఈసారి అటువంటి పరిస్థితి తలెత్తకుండా తన కుమార్తెను బాగా చూసుకునే కుటుంబానికి ఇవ్వడంవల్ల ఇబ్బంది ఉండదనే ఆలోచనలో ఉన్నారంట.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top