ఇండస్ట్రీలోకి మరో రేణు దేశాయ్.. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్

451

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, డివోర్స్, పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అవ్వడం.. ఇవన్నీ కామన్‌గా మారిపోయాయి. దీంతో పెళ్లి తర్వాత పిల్లలను కనడం కన్నా, పెళ్లికి ముందే పిల్లల్ని కన్నేస్తే ఓ పని అయిపోతుందని అనుకుంటున్నారేమో మరీ అంటూ నెటిజన్లు సిని సెలబ్రిటీలను ట్రోల్స్ చేస్తుంటారు. కేవలం చిత్ర పరిశ్రమలోనే కాకుండా.. బయట కూడా, ఫారిన్ కల్చర్ డేటింగ్‌ను ఇష్టపడుతున్నారో ఏమో తెలియదు కానీ చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు పెళ్లికి ముందే తప్పు చేస్తూ ప్రెగ్నెంట్ అవుతున్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి మరీ కామన్ అయిపోయాయి. ఇంతకుముందు మనం బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ పరిశ్రమలో మాత్రమే హీరోయిన్స్.. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయ్యారనే వార్తలు వినేవాళ్లం. కానీ ఇప్పుడు తెలుగు పరిశ్రమలో కూడా ఇలాంటివి వింటూనే ఉన్నాం.

Also Read: 13 మంది అరెస్ట్, నిర్లక్ష్యానికి కర్ణాటక పోలీసు సస్పెన్షన్

గతంలో రేణు దేశాయ్ పెళ్లికి ముందు ప్రెగ్నెంట్ అయ్యింది. అకీరా పుట్టిన తర్వాతనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను వివాహం చేసుకుందని నెటిజన్లు మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. హీరోయిన్ శ్రీదేవి కూడా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిందన్న వార్త నెట్టింట ఏ విధంగా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. తాజాగా.. పలువురు స్టార్ హీరోల సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గా నటించిన ఓ హీరోయిన్ కూడా ఇదే బాటలో వెళ్తుందని ఇండస్ట్రీ నుంచి ఓ టాక్ వినిపిస్తుంది. దీంతో సోషల్ మీడియాలో ఎన్టీఆర్ హీరోయిన్.. ఇప్పుడే పెళ్లి చేసుకుంటుందో, లేదా బిడ్డను కనేసి వివాహం చేసుకుంటుందో అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ హీరోయిన్ గత కొంతకాలం నుంచి ఓ కోలీవుడ్ దర్శకుడితో డేటింగ్ చేసిందని పుకార్లు కూడా జోరుగా వినిపించాయి. మరీ ఆమె ప్రెగ్నెన్సీకి కారణం అతడేనా? ఇంకెవరైనా? అని క్వశ్చన్స్ రేస్ చేస్తున్నారు పలువురు ఇండస్ట్రీలోని జనాలు.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top