OnePlus Ace 2 Pro Launch : ఆగస్టు 16న వన్‌ప్లస్ Ace 2 ప్రో ఫోన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే? పూర్తి వివరాలు మీకోసం..!

108

OnePlus Ace 2 Pro Launch : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే ఈ నెల 16 వరకు ఆగండి.. ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ వన్‌ప్లస్ (OnePlus) నుంచి వన్‌ప్లస్ (OnePlus Ace 2 Pro) ఆగస్టులో చైనాలో లాంచ్ చేయడానికి రెడీగా ఉంది. OnePlus , Weibo ద్వారా స్వదేశంలో కొత్త Ace-series స్మార్ట్‌ఫోన్ రాకను ధృవీకరించింది.

చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ద్వారా వన్‌ప్లస్ Ace 2 Pro ముందస్తు రిజర్వేషన్‌లను ప్రారంభించింది. స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 SoC, 24GB RAMతో వస్తుంది. వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ డిజైన్‌ను వెల్లడిస్తూ.. చైనీస్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో పోస్టర్‌లను కూడా షేర్ చేసింది. రాబోయే హ్యాండ్‌సెట్ గత ఏడాదిలో ప్రారంభమైన OnePlus Ace Proని ఫోన్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్ అని చెప్పవచ్చు.

వన్‌ప్లస్ Ace 2 Pro ఫోన్ ఆగష్టు 16న లాంచ్ అవుతుంది. Weiboలో కంపెనీ షేర్ చేసిన (చైనీస్‌లో) టీజర్ పోస్టర్ ప్రకారం.. లాంచ్ ఈవెంట్ చైనాలో స్థానిక కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 2.30 గంటలకు (12.00pm IST) జరుగుతుంది. 24GB RAMతో Snapdragon 8 Gen 2 SoCపై రన్ అవుతుందని తెలిపింది.

OnePlus ద్వారా అప్‌లోడ్ చేసిన పోస్టర్లు వన్‌ప్లస్ Ace 2 Proలో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉంటుందని సూచిస్తున్నాయి. ఇందులో బ్లాక్, సియాన్ షేడ్స్‌లో వస్తుంది. మధ్యలో హోల్ పంచ్ కటౌట్‌తో కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. OnePlus వెబ్‌సైట్‌లోని ప్రత్యేక ల్యాండింగ్ పేజీ ద్వారా వన్‌ప్లస్ Ace 2 Pro డిజైన్, స్పెసిఫికేషన్‌లను టీజ్ చేస్తోంది. కంపెనీ OnePlus Ace 2 Pro ప్రీ-రిజర్వేషన్‌లను కూడా ప్రారంభించింది.

వన్‌ప్లస్ Ace 2 Pro ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల 1.5K OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. అలర్ట్ స్లైడర్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో 50MP సోనీ IMX890 సెన్సార్, 8MP సెకండరీ సెన్సార్, 2MP షూటర్ ఉన్నాయి. సెల్ఫీలకు 16MP షూటర్ ఉండవచ్చు. 5,000mAh బ్యాటరీని అందిస్తుంది. 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందించనుంది.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top