Pawan Kalyan – Gaddar : గద్దర్ పై పవన్ ప్రత్యేక కావ్యం.. నా అన్న ప్రజా యుద్ధనౌక గద్దర్.. వీడియో వైరల్!

43

Pawan Kalyan – Gaddar : ప్రజా గాయకుడు, విప్లవ వీరుడు గద్దర్‌కు పది రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. అప్పటి నుంచి హైదరాబాద్‌ (Hyderabad) లోని అపోలో ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ వస్తున్నారు. అయితే నిన్న ఆగష్టు 6న ఆయన తుదిశ్వాస విడిచారు. 77 ఏళ్ళ వయసులో కన్నుమూసిన గద్దర్ మరణ వార్త విని తెలంగాణ ప్రజలతో పాటు ప్రతిఒక్కరు ఆవేదనకు గురవుతున్నారు. ఇక గద్దర్ కు ఎంతో ఆప్తుడైన పవన్ కళ్యాణ్.. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

పవన్ అండ్ గద్దర్ మధ్య ఎంతో మంచి బంధం ఉంది. గద్దర్ ని పవన్ కళ్యాణ్ ఒక ప్రజా గాయకుడికా ఎంతో గౌరవిస్తూనే తన సొంత అన్నలా భావించేవారు. నిన్న ఆయన మరణవార్త విన్న వెంటనే పవన్ గద్దర్ భౌతికకాయం వద్దకు చేరుకొని కన్నీరు పెట్టుకున్నారు. తాజాగా నేడు గద్దర్ పై ఒక కావ్యం చెబుతూ ఒక ప్రత్యేక వీడియోని షేర్ చేశాడు. “గుండెకు గొంతు వస్తే, బాధకు బాష వస్తే గద్దర్. అన్నిటికి మించి నా అన్న గద్దర్” అంటూ ఎమోషనల్ వీడియోని పవన్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశాడు

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pawan Kalyan (@pawankalyan)

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top