Paytm Freedom Travel Carnival : పేటీఎం యూజర్లకు గుడ్‌ న్యూస్.. మీరు బుకింగ్ చేసే ట్రావెల్ టిక్కెట్లపై భారీ డిస్కౌంట్లు.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే.. డోంట్ మిస్!

194

Paytm Freedom Travel Carnival : ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేస్తున్నారా? మీరు ఇప్పుడు (Paytm) ద్వారా మీ విమాన, రైలు లేదా బస్సు ప్రయాణ టిక్కెట్లపై ప్రత్యేక తగ్గింపులను పొందవచ్చు. ప్రముఖ పేమెంట్స్ యాప్ ఫ్రీడమ్ ట్రావెల్ కార్నివాల్‌ (Paytm Freedom Travel Carnival)ను ఆగస్టు 1 నుంచి 10 వరకు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

ఈ సమయంలో (Paytm) యూజర్లు విమాన, రైలు, బస్సు టిక్కెట్ బుకింగ్‌లపై డిస్కౌంట్లను పొందవచ్చు. రాబోయే స్వాతంత్ర్య దినోత్సవ వీకండ్‌లో పేటీఎం యూజర్లు తమ ప్రయాణ ప్రణాళికలపై డబ్బు ఆదా చేసుకోవచ్చు. ప్రస్తుతం జరుగుతున్న Paytm ఫ్రీడమ్ ట్రావెల్ కార్నివాల్‌లో అందుబాటులో ఉన్న డిస్కౌంట్లను వివరంగా పరిశీలిద్దాం.

విమాన టిక్కెట్లపై పేటీఎం తగ్గింపు :
పేటీఎం ప్రస్తుతం RBL బ్యాంక్, ICICI బ్యాంక్ నుంచి బ్యాంక్ ఆఫర్ల ద్వారా దేశీయ విమాన టిక్కెట్‌లపై 15 శాతం, అంతర్జాతీయ విమాన టిక్కెట్‌లపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది. పేటీఎం యూజర్లు Paytm Wallet, Paytm పోస్ట్‌పెయిడ్‌ ద్వారా దేశీయ విమాన బుకింగ్‌లపై ఫ్లాట్ 12 శాతం తగ్గింపును కూడా పొందవచ్చు.

ఇంకా, వినియోగదారులకు వారి టిక్కెట్ బుకింగ్‌లపై ఎక్కువ సేవింగ్స్ అందించడానికి కంపెనీ ఇండిగో, విస్తారా, స్పైస్‌జెట్, ఎయిర్‌ఏషియా, అకాసా ఎయిర్, ఎయిర్ ఇండియాతో సహా ప్రధాన విమానయాన సంస్థలతో కలిసి పనిచేసింది. విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, సాయుధ దళాల సిబ్బందికి కూడా Paytm ప్రత్యేక ఛార్జీలను అందిస్తోంది. వినియోగదారులు తమ విమాన టిక్కెట్లను జీరో కన్వీనియన్స్ రుసుముతో బుక్ చేసుకోవచ్చు. తద్వారా సేవింగ్స్ మరింత పెరుగుతుంది.

బస్ టిక్కెట్లపై పేటీఎం డిస్కౌంట్ :
బస్ టిక్కెట్లపై Paytm ‘CRAZYSALE’ కోడ్‌తో 25 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్, నిర్దిష్ట ఆపరేటర్లపై 20 శాతం వరకు అదనపు తగ్గింపును అందిస్తోంది. పేటీఎం యూజర్లు బెస్ట్ ప్రైస్ గ్యారెంటీడ్ ప్రోగ్రామ్ కింద 2,500 కన్నా ఎక్కువ బస్ ఆపరేటర్లలో అత్యల్ప ధరకు పొందవచ్చు.

రైలు టిక్కెట్లపై పేటీఎం డిస్కౌంట్ :
రైల్వే ప్రయాణికుల కోసం, Paytm జీరో ఛార్జీలతో UPI ద్వారా బుకింగ్‌లను అందిస్తోంది. వినియోగదారులు తమ బుకింగ్ PNR స్టేటస్ సులభంగా తెలుసుకోవచ్చు. వారి రైళ్లను రియల్ టైమ్ ట్రాక్ చేయవచ్చు పేటీఎం యాప్ ద్వారా ఏదైనా రైలు ప్రయాణ విచారణల కోసం 24/7 కస్టమర్ సపోర్టును యాక్సెస్ చేయవచ్చు.

పేటీఎం ఉచిత రద్దు పాలసీ :
అదనంగా, పేటీఎం విమాన, బస్సు, రైలు టిక్కెట్లపై ”Free Cancellation’ పాలసీని ప్రవేశపెడుతోంది. వినియోగదారులు టిక్కెట్ రద్దుపై వారి అకౌంట్‌కు 100 శాతం రీఫండ్ పొందవచ్చు. ఈ పాలసీలో హైడింగ్ ఛార్జీలు లేదా రద్దు రుసుములు లేవు. కంపెనీ వినియోగదారులకు తమ ప్రయాణ ప్రణాళికలపై కచ్చితంగా తెలియకుంటే వారి టిక్కెట్‌లను బుక్ చేసుకునేటప్పుడు ఎంపిక చేసుకోగలిగే ”Free Cancellation’ కింద అతి తక్కువ ప్రీమియంలతో యూజర్లకు అధికారం కల్పిస్తుంది’ అని పేటీఎం అధికారిక ప్రకటనలో పేర్కొంది.

Paytmలో టిక్కెట్లు బుక్ చేసుకోవడం ఎలా :
* పేటీఎం యాప్ నుంచి మీ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.
* మీ డివైజ్‌లో Paytm యాప్‌ని ఓపెన్ చేయండి.
* ‘Travel’ ట్యాబ్‌పై నొక్కండి.
* మీరు బుక్ చేయాలనుకుంటున్న ప్రయాణ టిక్కెట్ టైప్ ఎంచుకోండి. ఉదాహరణకు, మీరు విమాన టిక్కెట్లు, బస్సు టిక్కెట్లు, రైలు టిక్కెట్లు, హోటల్ బుకింగ్‌లు మొదలైనవాటిని బుక్ చేసుకోవచ్చు.
* మీ ప్రయాణ వివరాలను రిజిస్టర్ చేయండి. ఇందులో ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం, నగరాలు, ప్రయాణ తేదీ, ప్రయాణీకుల సంఖ్య, క్లాస్ ఆఫ్ ట్రావెల్ ఉన్నాయి.
* మీరు బుక్ చేయాలనుకుంటున్న ప్రయాణ ఎంపికలను ఎంచుకోండి. మీరు వివిధ ప్రయాణ ఎంపికలను ఎంచుకోవచ్చు. మీ అవసరాలకు బాగా సరిపోయేదాన్ని ఎంచుకోవచ్చు.
* మీ ప్రయాణ టిక్కెట్ల కోసం చెల్లించండి.
* పేటీఎం యూజర్లు తమ ప్రయాణ టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి Paytm UPI, Paytm వాలెట్, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్‌లు, క్రెడిట్ కార్డ్‌ల వంటి వివిధ మోడ్‌ల ద్వారా పేమెంట్లను ఖరారు చేసే అవకాశాన్ని అందిస్తుంది.
* మీ టిక్కెట్‌లను బుక్ చేసుకున్న తర్వాత, మీరు Confirmation ఇమెయిల్‌ను అందుకుంటారు.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top