సినిమా విడుదల కాలేదని.. గుండెపోటుకు గురైన నిర్మాత

165

రూ.కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా విడుదలకు నోచుకోకపోవడం, ఆర్థిక సమస్యల ఒత్తిడితో నిర్మాత విజయ్‌ జాగర్లమూడి (vijay jagarlamudi) గుండెపోటుకు గురయ్యారు.

ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 'ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌'లో భాగంగా భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న పిన్న వయస్కుడు ఖుదీరామ్‌ బోస్ జీవితాధారంగా 'ఖుదీరామ్‌ బోస్‌' (Khudiram Bose) సినిమాను విజయ్‌ నిర్మించారు. దేశభక్తి ప్రధానంగా రూపొందిన ఈ సినిమాను గతేడాది డిసెంబరు 22న పార్లమెంట్‌ సభ్యుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు.

Chiranjeevi: రెమ్యునరేషన్‌ తిరిగిచ్చేసిన మెగాస్టార్‌ చిరంజీవి..

గోవాలో జరిగిన 'ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా' వేడుకల్లోనూ ఈ చిత్రాన్ని ప్రదర్శించగా విశేష స్పందన దక్కింది. అలాంటి సినిమాని థియేటర్లలో విడుదల చేసేందుకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడడం, ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో విజయ్‌ మానసికంగా కుంగిపోయారు. ఖుదీరామ్‌ బోస్‌ గురించి ఈ తరానికి తెలియజేయాలనే తన ఆకాంక్ష నెరవేరకపోతోందనే బాధతో ఆస్పత్రి పాలయ్యారు.

(adsbygoogle = window.adsbygoogle || []).push({});
</script>

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, హిందీలో రూపొందిన ఈ చిత్రానికి విద్యాసాగర్‌ రాజు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రాకేశ్‌ జాగర్లమూడి, వివేక్‌ ఒబెరాయ్‌, అతుల్‌ కులకర్ణి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గతేడాది ఆగస్టులో విడుదల చేశారు. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేశారు. సంగీతం: మణిశర్మ, ప్రొడక్షన్‌ డిజైనర్‌: తోట తరణి, స్టంట్స్‌: కనల్‌ కన్నన్‌, సినిమాటోగ్రఫీ: రసూల్‌ ఎల్లోర్‌, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె. వెంకటేశ్‌.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top