Renu Desai : పవన్ అందుకే తరిమేశాడు... కౌంటరిచ్చిన రేణు దేశాయ్..

142

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. తన పిల్లల గురించి అప్డేట్స్ ఇవ్వడంతో పాటు తనపై వస్తున్న కామెంట్ల పై కూడా రియాక్ట్ అవుతుంది..

ఇక పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఎప్పుడు ఏదొక వార్తపై చర్చిస్తూ వార్తల్లో నిలుస్తుంది.. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది.. తనను మోసం చేశాడని రేణూ దేశాయ్ చెబుతూనే.. ఆయనకు డబ్బంటే ఆసక్తి ఉండదని, డబ్బు మనిషి కాదని, సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తి అంటూ.. ఆయనకు ఒకసారి అవకాశం ఇవ్వండి అంటూ ఇలా రేణూ దేశాయ్ షేర్ చేసిన వీడియోతో అందరూ ఆశ్చర్యపోయారు..

ఇకపోతే ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ అభిమానులు, జన సైనికులు రేణూ దేశాయ్‌ని నెత్తిన పెట్టేసుకున్నారు.. ఆమె ఎంత మంచిదో అంటూ పొగడ్తలతో ముంచేసారు.. అయితే పవన్ యాంటి ఫ్యాన్స్ మాత్రం ఆమె పై కామెంట్లు కురిపించారు.. ఎందుకు అన్నాడో తెలియదు కానీ.. ఓ నెటిజన్ మాత్రం ఓ కామెంట్ చేశాడు. దానిపై తాజాగా రేణు దేశాయ్ కూడా స్పందించడంతో అది కాస్త నెట్టింట చర్చనీయాంశంగా మారింది.. హా.. అందుకే నిన్ను పవన్ కళ్యాణ్ తన్ని తరిమేశాడు మేడం అని అన్నాడు. నన్ను తిట్టడంతో నీకు మనశ్శాంతి దొరికిందా?.. దొరక్కపోతే ఇంకా తిట్టండి.. నా మాజీ భర్త అభిమానులు, యాంటీ ఫ్యాన్స్ నుంచి తిట్లు తినడానికే నా జీవితం ఉంది.. కానివ్వండి అంటూ రేణూ దేశాయ్ కూల్‌గా రిప్లై ఇచ్చింది..

అంతేకాదు.. నా విడాకుల విషయంలో అసలు నిజం చెబితే తిట్టారు.. ఇప్పుడు భారతీయురాలుగా ఆయనకు సపోర్ట్ చేస్తే ఇప్పుడు తిడుతున్నారు..మొదట్లోనేమో నేను వేరే పార్టీ దగ్గర డబ్బులు తీసుకుని ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను అని అన్నారు.. కానీ ఇప్పుడు నేను నా మాజీ భర్త దగ్గర డబ్బులు తీసుకుని ఇలా మాట్లాడుతున్నానని అంటున్నారు.. నేను అప్పుడైనా ఇప్పుడైనా నిజమే మాట్లాడాను.. ఒక్క మాట కూడా అబద్దం చెప్పలేదు.. నిజాలు చెప్పినందుకు, నిజంగా ప్రేమించినందుకు ఇదే నాకు జరిగే శాస్తిలా ఉంది.. ఇదే నా తలరాత అనుకుంటే.. కానివ్వండి.. ఇంకా తిట్లు తిట్టడం స్టార్ట్ చేయండి అని రేణూ దేశాయ్ బాధపడింది.. రేణు దేశాయ్ మాటల పై చాలా మంది ఫ్యాన్స్ కూడా బాధ పడుతున్నారు.. మొత్తానికి ఇది నెట్టింట ట్రెండ్ అవుతుంది..

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top