Rohit Sharma : పాకిస్తాన్ బౌల‌ర్ల‌పై ప్ర‌శ్న‌.. రోహిత్ శ‌ర్మ స‌మాధానం విన్న రితికా ఏం చేసిందంటే..?

90

Rohit Sharma-Ritika Sajdeh : భార‌త కెప్టెన్‌ రోహిత్ శ‌ర్మ (Rohit Sharma) మైదానంలో ఎంత దూకుడుగా బ్యాటింగ్ చేస్తాడో బ‌య‌ట అంత స‌ర‌దాగా ఉంటాడు. విలేక‌రులు ఏమైన ప్ర‌శ్న‌లు అడిగిన‌ప్పుడు ఒక్కొసారి చాలా ఫ‌న్నీగా స‌మాధానాలు చెబుతుంటాడు. ప్ర‌స్తుతం యూఎస్‌లో ఉన్న హిట్‌మ్యాన్‌ను ఓ అభిమాని పాకిస్తాన్ బౌల‌ర్ల గురించి ఓ ప్ర‌శ్న అడిగాడు. దీనిపై రోహిత్ స్పందించిన తీరు న‌వ్వులు పూయించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఇటీవ‌ల వెస్టిండీస్‌తో జరిగిన వ‌న్డే సిరీస్‌లో రోహిత్ శ‌ర్మ ఆడాడు. మొద‌టి వ‌న్డేలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. ఆసియా క‌ప్‌, ప్ర‌పంచ‌క‌ప్‌ల‌కు ముందు విభిన్న కాంబినేష‌న్లు ప్ర‌య‌త్నించ‌డంతో పాటు యువ ఆట‌గాళ్ల‌ను తీర్చిదిద్దేందుకు రెండ‌వ‌, మూడో వ‌న్డేల‌కు హిట్‌మ్యాన్ బెంచ్‌కే ప‌రిమితం అయ్యాడు. ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టు వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్‌కు దూరంగా ఉన్న రోహిత్.. త‌న భార్య రితిక సజ్దే(Ritika Sajdeh)తో క‌లిసి యూఎస్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లాడు.

అక్క‌డ ఐసీసీ వ‌ర‌ల్డ్‌క‌ప్ ఈవెంట్ ప్ర‌చార కార్య‌క్ర‌మంలో రోహిత్ పాల్గొన్నాడు. ఈ సారి సొంత‌గ‌డ్డ‌పై ప్ర‌పంచ‌క‌ప్ జ‌ర‌గ‌నుండ‌డంతో విజ‌యం సాధించి క‌ప్పును అభిమానుల‌కు బ‌హుమ‌తిగా ఇస్తామ‌ని హిట్‌మ్యాన్ తెలిపాడు. ఇక ఈ ఈవెంట్‌లో పాకిస్తాన్ జ‌ట్టు గురించి రోహిత్‌కు ఓ ప్ర‌శ్న ఎదురైంది. పాకిస్తాన్ టీమ్‌లో ఏ బౌల‌ర్‌ను ఎదుర్కొవ‌డం క‌ష్టం అని హిట్‌మ్యాన్‌ను ప్ర‌శ్నించారు.

‘పాకిస్తాన్ జట్టులోని పేసర్లందరూ సమానమే. నేను ఏ ఒక్క ఆట‌గాడి పేరును చెప్ప‌ద‌లుచుకోలేదు. అలా చెబితే అది పెద్ద వివాదాన్ని సృష్టిస్తుంది.’ అని రోహిత్ అన్నాడు. ‘ఒక‌రి పేరును చెబితే రెండో వ్య‌క్తి బాధ‌ప‌డుతాడు. పోనీ రెండో వ్య‌క్తి పేరు చెబితే మూడో వ్య‌క్తి. ఇలా వాళ్ల‌ను బాధ‌పెట్ట‌డం ఇష్టం లేదు. అందుకే ఆ జ‌ట్టులోని బౌల‌ర్లు అంతా మంచివాళ్లే.’ అని రోహిత్ శ‌ర్మ అన్నాడు. ఈ స‌మాధానం విన్న రోహిత్ భార్య రితికా స‌జ్దేతో పాటు అక్క‌డ ఉన్న వారంతా ప‌డి ప‌డి న‌వ్వారు. ఈ వీడియో వైర‌ల్‌గా మార‌గా నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

ఇదిలా ఉంటే.. భార‌త్ వేదిక‌గా అక్టోబ‌ర్ 5 నుంచి న‌వంబ‌రు 19 వ‌ర‌కు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ టోర్నీ జ‌ర‌గ‌నుంది. అంత‌కంటే ముందు ఆసియా క‌ప్ జ‌ర‌గ‌నుంది. చిర‌కాల ప్ర‌త్య‌ర్థులు అయిన భార‌త్‌, పాకిస్తాన్‌లు శ్రీలంక వేదిక‌గా సెప్టెంబ‌ర్ 2న త‌ల‌ప‌డ‌నున్నాయి.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top