sai pallavi:జపాన్ లో స్టార్ హీరో కొడుకుతో సాయి పల్లవి ఫుల్ ఎంజాయ్...

399

సాయి పల్లవి.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . పేరుకి మలయాళ బ్యూటీనే అయినా తెలుగులో బాగా పాపులారిటీ సంపాదించుకుంది. రీసెంట్గా తనని తన చెల్లి నిశ్చితార్థంలో తీన్మార్ డాన్స్ తో అదరగొట్టిన సాయి పల్లవికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అయిందో మనం చూసాం. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ అంటే హీరోయిన్స్ కేవలం ఎక్స్పోజింగ్ అనే అనుకుంటారు ..ఆ ట్రెండ్ ని మార్చేసిన ఘనత సాయి పల్లవి కే దక్కుతుంది .

హీరోయిన్స్ ఎక్స్పోజింగ్ కే కాదు నటించడానికి పనికొస్తారు అంటూ ప్రూవ్ చేసింది . ఒక స్టార్ హీరో కొడుకుతో జపాన్ లో సాయి పల్లవి తిరుగుతున్న ఫొటోస్ వైరల్ అవుతున్నాయి . బాలీవుడ్ స్టార్ హీరో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ పెద్దబ్బాయి జునైద్ ఖాన్ హీరోగా చేస్తున్న సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా సెలెక్ట్ అయింది. ఈ సినిమాకి సంబంధించి ఆల్రెడీ ఒక షెడ్యూల్ కూడా పూర్తయిపోయింది .

కాగా ఈ సినిమా షూటింగ్ కోసం జపాన్ వెళ్లారు సాయి పల్లవి. అక్కడ కీలక సన్నివేశాలు కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్నారు . ఈ క్రమంలోనే అక్కడ దిగిన కొన్ని ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . ఇప్పటివరకు జపాన్లో ఏ సినిమా కూడా షూట్ చేయని సప్పోరో ఏరియాలో ఈ సినిమా షూటింగ్ చేసేందుకు పర్మిషన్ తెచ్చుకున్నారట . ఈ సినిమాలో సాయి పల్లవి పాత్ర చాలా స్పెషల్ గా ఉండబోతుందట . ప్రజెంట్ సాయి పల్లవి తెలుగులో తండేల్ అనే సినిమాలో కూడా నటిస్తుంది . దీంతో సాయి పల్లవికి సంబంధించిన కొన్ని పిక్చర్స్ వైరల్ అవుతున్నాయి..!!

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top