Samantha: మళ్లీ ప్రేమలో పడ్డ సమంత...!

49

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha)సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. ఆమె పెట్టే పోస్టులు పెట్టే వైరల్ అయిపోతుంటాయి. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ చర్చలకు దారితీస్తోంది. ‘చావు నుంచి మనల్ని ఏది కాపాడలేక పోతే కనీసం ప్రేమతో నైనా జీవితాన్ని కాపాడుకోవాలి’ అని అర్థం వచ్చేలా స్పానిష్ కవి పాబ్లో నెరుడా రాసిన కవితను సమంత ఇన్ స్టా స్టోరీస్ లో పోస్ట్ చేసింది. దీంతో ఆమె మళ్లీ ప్రేమలో పడిందా? అనే చర్చ నెట్టింట్లో మొదలైంది. ఒకవేళ అదే నిజమైతే ఎవరా వ్యక్తి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Also Read: ఆ పార్టీలో నాపై చెయి వేశాడు.. నిలదీస్తే బోరున ఏడ్చాడు

హీరో అక్కినేని నాగచైతన్య( Naga Chaitanya), సమంత 2017లో ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 2021 లో వీళ్లిద్దరూ తమ వైవాహిక బంధానికి ముగింపు పలికారు. అప్పటినుంచి సమంత సినిమాల్లో బిజీ అయిపోయింది. ‘యశోద’, ‘శాకుంతలం’ వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసిన సమంత.. ప్రస్తుతం హాలీవుడ్ సిరీస్ ‘సిటాడెల్’ లో నటిస్తోంది. దీంతోపాటు టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తో కలిసి నటిస్తున్న ‘ఖుషి’ సెప్టెంబర్ లో విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాపై ఆమె భారీ ఆశలే పెట్టుకుంది. మరోవైపు ‘కస్టడీ’ సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగచైతన్య.. ప్రస్తుతం ‘దూత’ లో నటిస్తున్నారు.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top