Samsung Galaxy F34 5G : భారీ బ్యాటరీతో శాంసంగ్ గెలాక్సీ F34 5G ఫోన్.. ధర ఎంతో తెలిస్తే కొనేవరకు ఆగలేరంతే..!

89

Samsung Galaxy F34 5G : కొత్త ఫోన్ కొంటున్నారా? ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) నుంచి ఆగస్టు 7న భారత మార్కెట్లోకి సరికొత్త 5G మోడల్ ఫోన్ లాంచ్ అయింది.  కంపెనీ గతంలో అనేక స్మార్ట్‌ఫోన్ ధరల రేంజ్ టీజ్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్ ఇంతకుముందు గెలాక్సీ A34 5G రీబ్రాండెడ్ వెర్షన్‌గా వస్తుంది. ఈ ఏడాది మార్చిలో ఆక్టా-కోర్ SoC, 5,000mAh బ్యాటరీతో వచ్చింది. అయితే, Galaxy F34 5G లాంచ్‌తో రెండు మోడళ్ల డిజైన్ ఒకేలా ఉన్నప్పటికీ.. స్పెసిఫికేషన్‌లలో మాత్రం కొంచెం మార్పులు ఉంటాయి. ఉదాహరణకు, కొత్తగా లాంచ్ అయిన Galaxy F34 5G ఒక ఇంటర్నల్ Exynos చిప్, కొంచెం పెద్ద 6,000mAh బ్యాటరీతో వస్తుంది.

భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ F34 5G ధర ఎంతంటే? :
శాంసంగ్ గెలాక్సీ F34 5G ఫోన్ 6GB + 128GB వేరియంట్ భారత మార్కెట్లో రూ. 18,999, అయితే 8GB + 128GB ఆప్షన్ ధర రూ. 20,999 ఉంటుంది. ఈ ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రీ-ఆర్డర్‌లకు అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ తొలి డెలివరీ తేదీని ఆగస్టు 12గా లిస్టు చేసింది. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లు నో-కాస్ట్ EMI ప్లాన్‌ రూ.2,111తో కొనుగోలు చేయొచ్చు.

కొనుగోలు సమయంలో అనేక మంది కస్టమర్‌లు రూ. 1,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ICICI లేదా Kotak బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగిస్తే.. కొన్ని షరతులతో వర్తిస్తాయి. ఇతర బ్యాంక్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. Galaxy F34 5G ఫోన్ ఎలక్ట్రిక్ బ్లాక్, మిస్టిక్ గ్రీన్ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ F34 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ :
6.46-అంగుళాల ఫుల్-HD+ (2340 x 1080 పిక్సెల్‌లు) sAMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. గెలాక్సీ F34 5G ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 398 ppi పిక్సెల్ సాంద్రత, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో వస్తుంది. 8GB వరకు RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజీతో ఇంటర్నల్ ఆక్టా-కోర్ Exynos 1280 SoC ద్వారా అందిస్తుంది. Android 13-ఆధారిత One UI 5.1తో షిప్పించ్ చేయొచ్చు. కెమెరా విభాగంలో Galaxy F34 5G ఫోన్ 50MP ప్రైమరీ సెన్సార్, అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో 8MP సెన్సార్, వెనుకవైపు 2MP మాక్రో సెన్సార్, నిలువుగా 3 వృత్తాకార స్లాట్‌లలో ఉంటుంది. వెనుక ప్యానెల్‌కు ఎగువ ఎడమవైపున LED ఫ్లాష్ ఉంటుంది.

13MP ఫ్రంట్ కెమెరా సెన్సార్ డిస్‌ప్లే పైభాగంలో సెంటర్-అలైన్డ్ వాటర్‌డ్రాప్ నాచ్‌లో ఉంటుంది. Galaxy F34 పెద్ద 6,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. సెక్యూరిటీ విషయానికి వస్తే.. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. 5G, GPS, NFC, Wi-Fi, బ్లూటూత్ v5.3, USB టైప్-C కనెక్టివిటీకి సపోర్టు ఇస్తుంది. 208 గ్రాముల బరువు, హ్యాండ్‌సెట్ సైజు 161.7mm x 77.2mm x 8.8mm వరకు అందిస్తుంది.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top